బ్రిటన్, అమెరికా, కెనడా ఇలా ఏ దేశానికి వెళ్లినా అక్కడి భారతీయ రెస్టారెంట్ ను చూసినప్పుడల్లా మనం గర్వపడుతుంటాం. ఈ రెస్టారెంట్లు, పలు అంశాల్లో విదేశాల్లో భారతీయులు మంచి పేరు సంపాదించుకుంటున్నారు. భారతదేశంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తుంటారు. అయితే బాగా పరిశీలిస్తే ఇక్కడ కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇస్లామిక్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని తిరుగుబాటు గ్రూపుల సంకీర్ణం సిరియా రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకుంది. దీంతో ఈ పశ్చిమాసియా దేశంలో 24 ఏళ్ల బషర్ అల్ అసద్ పాలనకు తెరపడింది. అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వెళ్లిపోయారు! నియంతృత్వానికి వ్యతిరేకంగా 2008లో ట్యునీషియాలో మొదలైన అరబ్ స్ప్రింగ్ మూడేళ్ల తర్వాత 2011లో సిరియాకు చేరుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ జిల్లాలోని పోలీస్ బేస్ క్యాంపుపై నక్సలైట్లు మరోసారి దాడి చేశారు. గత మూడు రోజుల్లో నక్సలైట్లు పోలీసులపై దాడి చేయడం ఇది రెండోసారి. పోలీసు శిబిరంలో కాల్పులు జరిగినట్లు బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడపల్లి పోలీస్ క్యాంపుపై నక్సలైట్లు దాడి చేశారు.. పోలీసులు, నక్సలైట్ల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. బేస్ క్యాంపులో సైనికులకు ప్రథమ చికిత్స చేస్తున్నారు. ఈ దాడుల వెనుక కేంద్ర కమిటీ అగ్రనేత…
మీరు కొత్త 7-సీటర్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. ఈ శుభవార్త మీ కోసమే. ప్రముఖ కార్ల తయారీదారు రెనాల్ట్ డిసెంబర్ 2024లో దాని అద్భుతమైన MPV ట్రైబర్‌పై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. రెనాల్ట్ ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 8.69 లక్షల వరకు ఉంటుంది. ఈ కారుపై కంపెనీ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. కస్టమర్లు కారును రూ. 8999 EMIతో ఇంటికి తీసుకురావచ్చు.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో 5 మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. అడిలైడ్ టెస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లపై భారీ ప్రభావం చూపింది. భారత్ నుంచి నంబర్-1 టాప్ ప్లేస్‌ను కంగారూలు కొల్లగొట్టారు. ఆస్ట్రేలియా 60.71 శాతం మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య మరోసారి పోస్టర్ వార్ మొదలైంది. ఈ రాజకీయ పోరులో ఇరు రాజకీయ పార్టీల నుంచి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. బీజేపీ తన పోస్టర్లలో 'ఆప్' కుంభకోణాలను బయటపెట్టడంలో బిజీగా ఉంది. అదే సమయంలో ఆప్ కూడా 'పుష్ప' తరహాలో బీజేపీపై విరుచుకుపడింది.
తమ డిమాండ్లు పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు మళ్లీ ఢిల్లీ వైపు పాదయాత్ర చేయనున్నారు. తమ సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్చలు ప్రారంభించకపోవడంతో డిసెంబర్ 8న మధ్యాహ్నం 12 గంటలకు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీ వైపు 101 మంది రైతుల 'జాతా' ప్రారంభమవుతుందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు.
జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ లో ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యమయ్యాయి. జిల్లాలో ఆదివారం ఉదయం ఇద్దరు పోలీసులు బుల్లెట్ గాయాలతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పరస్పర విబేధాలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు.
మగవాళ్లు ఆడవాళ్లను వేధించడం, వాళ్ల ఇళ్లల్లోంచి వెళ్లగొట్టడం లాంటి ఉదంతాలు మీరు ఎన్నో వినే ఉంటారు. కానీ యూపీలోని అమ్రోహా జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధంగా ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భార్య భర్తను కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆ మహిళ యూపీకి చెందిన పోలీస్ కానిస్టేబుల్. తన భార్య తనను కొట్టిందని.. జైలుకు పంపుతానని బెదిరించిందని బాధితుడైన భర్త ఆరోపించాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
తనపై కుట్ర జరుగుతోందని పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అన్నారు. ఇందులో పోలీసులు కూడా భాగస్వాములయ్యారని ఆరోపించారు. తనతో పాటు తన సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను ఇరికిస్తున్నారన్నారు. నేను జైలులో ఉన్నాను. ఇక్కడి నుంచి ఒక వ్యక్తిని ఎలా బెదిరిస్తాను? అని పేర్కొన్నారు. జైలు నుంచి హత్య ఎలా చేస్తాం? అని తెలిపారు. శనివారం జోధ్‌పూర్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో లారెన్స్ బిష్ణోయ్ తన వివరణ ఇచ్చారు.