స్కైప్ విషయంలో మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మే నెల నుంచి ఆ కంపెనీ స్కైప్‌ను శాశ్వతంగా మూసి వేయబోతోంది. 22 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి తెరపడనుంది. స్కైప్ 2003 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VOIP) ప్లాట్‌ఫామ్‌గా ఉద్భవించింది. 2011లో, మైక్రోసాఫ్ట్ దీనిని $8.5 బిలియన్లకు కొనుగోలు చేసింది. దీని తరువాత.. మైక్రోసాఫ్ట్ క్రమంగా ఈ ప్లాట్‌ఫామ్ కి మార్పులు చేస్తూ వచ్చింది. ఇటీవల ఆ కంపెనీ విండోస్ లైవ్ మెసెంజర్‌ను తొలగించింది. 2015 లో, మైక్రోసాఫ్ట్ స్కైప్‌ను విండోస్ 10 లో అనుసంధానించడానికి ప్రయత్నించింది. అయితే.. దాన్ని తొమ్మిది నెలల్లోనే మూసివేయాల్సి వచ్చింది. మైక్రో సాఫ్ట్ టీమ్స్లో వీడియో కాల్స్, చాట్స్ చేసుకోవాలని ఆ సంస్థ సూచించినట్లు తెలిసింది.
READ MORE: Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన విద్యార్థి నేత కొత్త రాజకీయ పార్టీ..
ఆపిల్ కి చెందిన iMessage తో పోటీ పడగలిగేలా మైక్రోసాఫ్ట్ స్కైప్‌ను అనేకసార్లు పునఃరూపకల్పన చేసింది. అయినా లాభం లేకపోవడంతో చివరికి ఈ నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ 2017 సంవత్సరంలో టీమ్స్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీల కమ్యూనికేషన్ల కోసం స్లాక్ వంటి ప్లాట్‌ఫామ్‌లతో పోటీ పడటానికి టీమ్స్‌ను ప్రత్యేకంగా సృష్టించింది. అప్పటి నుంచి స్కైప్ అంతర్గతంగా పోటీ ఎదుర్కొంటూ వచ్చింది. ఇలా రాను రాను స్కైప్ కి ఆదరణ తగ్గింది. మైక్రోసాఫ్ట్ సంస్థ స్కైప్ను శాశ్వతంగా మూసేస్తుందన్న వాదనలు వినిపించాయి. కోవిడ్-19 మహమ్మారి తర్వాత కంపెనీ స్కైప్ను పట్టించుకోవడం మానేసింది. ఇప్పటివరకు స్కైప్ వాడుతున్న వారు టీమ్స్‌కు మారాల్సి ఉంటుంది. ఇప్పటికే కొందరికీ టీమ్స్‌కు మారారని మెసేజ్‌లు కూడా వచ్చాయి. టీమ్స్ నుంచే వీడియోకాల్స్ వంటి కార్యకలాపాలు కొనసాగించాలని అందులో సూచించారు.
READ MORE: Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్..