మోహన్‌బాబు ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన వెలువడింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాత్రి బీపీ పెరగడంతో పాటు.. కంటి కింద, కాలికి చిన్న చిన్న గాయాలు అయినట్లు చెప్పారు. ప్రస్తుతం జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు.. ప్రస్తుతం కార్డియోలజీ, జనరల్ ఫిజీసియన్ పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆస్పత్రి యాజమాన్యం అనుమతి తరువాత మోహన్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని వైద్యులు వెల్లడించారు. అయితే ఇవ్వాళ రాచకొండ సీపీ యెదుట హాజరుకావాల్సి ఉండగా... మోహన్ బాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..హెల్త్ బులిటెన్…
మంచు మనోజ్, మౌనిక జల్పల్లి నివాసంలోనే ఉన్నారు. ఉదయం 10:30 కి విచారణకు హాజరవ్వాలని మోహన్ బాబు, మనోజ్, విష్ణుకి రాచకొండ సీపీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మోహన్ బాబు, మోహన్ బాబు భార్య.. ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అదే ఆస్పత్రిలో విష్ణు ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం రాచకొండ సీపీ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. గన్లు కూడా సరెండర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పహాడి షరీఫ్ పోలీసులు.. మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు.…
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కార్యాలయంపై దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. సమాచారం మేరకు దక్షిణ కొరియా పోలీసులు ఆయన కార్యాలయంపై దాడి చేశారు. అంతకుముందు డిసెంబర్ 9న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించారు. ఆయనపై దర్యాప్తు ప్రారంభించినందుకు గానూ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. అనూహ్యంగా ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధించి గందరగోళాన్ని సృష్టించిన విషయం తెలిసిందే.
ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మంగపేట మండలం చుంచపెల్లి వద్ద గోదావరి నది దాటి వచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు పులి అడుగులు గుర్తించారు. పులి పాద ముద్రలు అనుసరించి మల్లూరు లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం వైపు వెళ్లి ఉంటుందని అంచనాకి వచ్చారు. చుంచుపల్లి, పాలయిగూడెం, ఓడగుడెం, మల్లూరు, నిలాధ్రిపేట, బాలన్నగూడెం పరిసర ప్రాంతాల ప్రజలను మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అప్రమత్తం చేశారు. పులి ఎలాంటి హాని తలపెట్టదని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడున్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బౌన్సర్ల తో పాటు మోహన్ బాబు, విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. రేపు ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మోహన్‌బాబుకు పోలీసు శాఖ సూచించింది.
తిరుగుబాటు దళాలు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని గద్దె దించిన రెండు రోజుల తర్వాత మంగళవారం సిరియా నుంచి 75 మంది భారతీయ పౌరులను భారతదేశం తరలించింది. భద్రతా పరిస్థితిని అంచనా వేసిన తర్వాత డమాస్కస్, బీరూట్‌లోని భారత రాయబార కార్యాలయాలు తరలింపు ప్రక్రియను ప్రారంభించాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. "ఇటీవలి పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈరోజు 75 మంది భారతీయ పౌరులను సిరియా నుంచి తరలించింది" అని అర్ధరాత్రి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
మహా కుంభమేళా 2025 జనవరి 13 నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా దాదాపు 50 రోజుల పాటు కొనసాగుతుంది. మహాకుంభం ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా చెబుతారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. రాజ స్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో చివరిసారిగా 2012లో మహా కుంభమేళా జరిగింది.
అదానీ కేసుపై లోక్‌సభలో విపక్ష ఎంపీలు సోమవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరసన తెలిపారు. ఈ నిరసనలో కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. నిరసన సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాణికం ఠాగూర్, సప్తగిరి శంకర్ ఉలక ప్రధాని మోడీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మాస్క్‌లు ధరించారు. వీరిద్దరినీ ఫొటోలు తీస్తూ.. హడావిడి చేస్తున్న వీడియోను రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. మోడీ, అదానీని ఉద్దేశించి..”వీరిది […]
నేడు ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లి లో ఆదివాసీ అస్తిత్వ పోరు గర్జన సభ నిర్వహిస్తున్నారు. తుడుం దెబ్బ రాయి సెంటర్ ఆధ్వర్యంలో సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివాసి చట్టాల అమలు, హక్కులు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సభ నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదివాసి చట్టాలు హక్కులు జీవోలు అన్నీ కూడా కాలరాస్తున్నాయని తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు, వారిపై దాడులను తిప్పికొడుతూ తమ అస్తిత్వాన్ని కాపాడుకునే సందర్భంగా ఇవ్వాళ గ్రామ గ్రామాన జెండాలు…
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నమనేని రమేష్ పిటిషన్ డిస్మిస్ చేసింది. పదిన్నర సంవత్సరాల పాటు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించినట్లు కోర్టు తెలిపింది. రూ.30 లక్షల జరిమానా విధించింది. ఆది శ్రీనివాస్ కు రూ. 25 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మరో 5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని సూచించింది. నెల…