కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉటంకిస్తూ వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వ ఉద్దేశాలను ఆయన ప్రశ్నించారు. “మత సమూహాలకు.. వారి మత, ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించి.. ఆ సంస్థలను వారే ముందుకు తీసుకెళ్లే హక్కును ఆర్టికల్ 26 ఇస్తుంది." అని చెప్పారు. ప్రధాని మోడీ వక్ఫ్‌కు రాజ్యాంగంతో సంబంధం లేదని చెప్పారు.. ఒక్కసారి ఆర్టికల్ 26ను చదవండి అని ఒవైసీ సూచించారు.
పంజాబ్-హర్యానా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శంభు సరిహద్దు నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు రైతులు యత్నిస్తున్నారు. రైతులపై పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. టియర్ గ్యాస్ షెల్స్ వల్ల 17 మంది రైతులు గాయపడ్డారు. ఆ తర్వాత తోటి రైతులు గాయపడిన వాళ్లను స్ట్రెచర్లపై ఆస్పత్రికి తరించారు. కాగా.. ప్రస్తుతం 101 మంది రైతుల బృందం ఢిల్లీ మార్చ్‌ను విరమించుకుంది. మరోవైపు అంబాలాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 17 (అర్ధరాత్రి…
ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో 46 ఏళ్ల నాటి దేవాలయం బయట పడింది. ఈ శివాలయాన్ని బయటపడకుండా దాచినట్లు తెలుస్తోంది. ఈ పరమేశ్వరుని ఆలయాన్ని పోలీసులు గుర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవానికి.. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదు హింసాకాండ జరిగినప్పటి నుంచి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దుండగులపై సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ సమయంలో పలు ఏరియాల్లో తిరిగి తనిఖీ చేసిన ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్.. అక్రమ కరెంట్ కనెక్షన్లను […]
వినయ్ మోహన్‌బాబుకు మొదటి బిడ్డ లాంటి వారని.. తనకు అన్న లాంటి వారని మంచు విష్ణు తెలిపారు. ఆయన్ని ఎవ్వరూ కొట్టే అంత ధైర్యం చెయ్యరని స్పష్టం చేశారు. "మా నాన్న ప్రతిసారి చెబుతారు.. భారత దేశంలో ఐఐటీలను ఛాలెంజ్ చేసిన ఘనత మోహన్ బాబు యూనివర్సిటీ కి ఉంది.. మా యూనివర్సిటీ ఓపెన్ బుక్ లాంటిది.. మా యూనివర్సిటీలో 53 శాతం.. అమ్మాయిలు ఉన్నారు.. ఆయన క్రమశిక్షణ ని నమ్మి అమ్మాయిలను పేరెంట్స్ అక్కడ జాయిన్ చేస్తున్నారు.. మాకు అది దేవాలయం.. దాని…
ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదని మంచు విష్ణు అన్నారు. మూడు తరాలుగా తమ కుటుంబం మీడియాతో సత్సంబంధాలు కలిగి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఇష్యూస్ ఉంటాయన్నారు. "ఎక్కువ మాట్లాడితే ఎక్కడ బ్రేక్ డౌన్ అవుతాము.. నాకు ఇది చాలా పెయిన్ ఫుల్.. మేమెంటో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు.. మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నాను.. మీకు కుటుంబాలు ఉన్నాయి... మీకు తండ్రులు ఉన్నారు.. ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి.. సెన్సేషన్ ఎందుకు అవుతుందో తెలియడం లేదు.. కేవలం…
కర్ణాటకలోని రామ్ నగర్లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నవజాత శిశువును విక్రయించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. 40 ఏళ్ల మహిళ తన 30 రోజుల నవజాత శిశువును రూ. 1.5 లక్షలకు విక్రయించింది. తన కొడుకు కనిపించడం లేదని, భార్యపై అనుమానం ఉందని మహిళ భర్త ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భర్త అప్పు తీర్చేందుకే బిడ్డను భార్య అమ్మేసిందని చెబుతున్నారు.
మనోజ్- మోహన్ బాబు గొడవలో వెలుగులోకి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చెన్నై లో ఉన్న ఓ టాయ్స్ కంపెనీని కొనుగోలు చేసేందుకు మౌనిక- మనోజ్ దంపతులు సిద్ధమయ్యారు. మనోజ్ కి వ్యాపారం చేయడం తెలియదని మోహన్ బాబు కంపెనీ కొనుగోలుకు నిరాకరించారు. ఇప్పటికే పలు వ్యసనాలకు అలవాటు పడ్డారని మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మౌనిక- మనోజ్ దంపతులను జల్పల్లి ఇంట్లోనే ఉండాలని చెప్పారు. వ్యాపారంతో పాటు రాజకీయాల్లోకి వెళ్లాలనే యోచనలో […]
మోహన్ బాబు జల్పల్లి నివాసం ముందు మీడియా ప్రతినిధుల ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ను లేవనెత్తారు. మోహన్ బాబు కుటుంబాన్ని మా అసోసియేషన్ నుంచి తొలగించాలని పేర్కొన్నారు. ఈ ఆందోళనకు మంచు మనోజ్ మద్దతు తెలిపారు.మీడియా ప్రతినిధులతో కలిసి ఆందోళనలో కూర్చున్నారు.
మీడియాపై దాడి ఘటనలో మోహన్ బాబు మీద కేసు నమోదు చేశారు. మోహన్ బాబుపై 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు మోహన్‌బాబు ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన వెలువడింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాత్రి బీపీ పెరగడంతో పాటు.. కంటి కింద, కాలికి చిన్న చిన్న గాయాలు అయినట్లు చెప్పారు. ప్రస్తుతం జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు..
షేర్ మార్కెట్ కొంప ముంచింది. ఓ ఇంటి యజమానికి షేర్ మార్కె్ట్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోయాడు. అప్పుల బాధ భరించలేక కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడింది. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య ( 60), శ్రీదేవి (50) దంపతులకు ఇద్దరు సంతానం. మొండయ్య అప్పులు చేసిన మరీ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోయాడు.. చేసిన అప్పులు చెల్లించలేక నిన్న…