Solar E- Scooter: స్క్రాప్‌తో 7 సీటర్ సోలార్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ.. ఏకంగా 200 కి.మి రేంజ్!
- గతంలో వైరల్ అయిన వీడియో
- మరోసారి వీడియోను షేర్ చేసిన బిగ్ బీ
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూసినప్పుడు మన ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. కొన్నింటిలో ప్రజల సృజనాత్మకత మనల్ని అబ్బుర పరుస్తుంది. అదే వీడియోను ఓ సెలబ్రిటీ షేర్ చేస్తే.. ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. తాజాగా అలాంటి ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోను బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ షేర్ చేశారు. ఇందులో కొంతమంది పిల్లలు సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని తయారు చేశారు. ఈ టూ వీలర్‌లో ఒకేసారి 7 మంది ప్రయాణించవచ్చు.
అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో.. 7 మంది పిల్లలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై కూర్చుని కనిపిస్తున్నారు. ఓ వ్యక్తి వీళ్లను వీడియో తీశాడు. ఈ బైడ్‌ను నడుపుతున్న బాలుడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. “ఇది స్క్రాప్ పార్ట్స్ తో తయారు చేసిన సోలార్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీన్ని తయారు చేసేందుకు దాదాపు రూ. 8,000-10,000 ఖర్చు అయ్యింది. కస్టమ్-ఫిట్టెడ్ సోలార్ ప్యానెల్ సహాయంతో దీనిని రీఛార్జ్ చేస్తాం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 200 కి.మీ.ల రేంజ్ ఇస్తుంది. సూర్యకాంతి ఎక్కువగా ఉంటే దాని రేంజ్ పెరుగుతుంది. సూర్య కాంతి ఉన్నంత వరకు ఇది నడుస్తూనే ఉంటుంది!” అని బాలుడు చెబుతాడు.
Also Read
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
దీని డిజైన్ గురించి చెప్పాలంటే.. పూర్తిగా ఇనుమును ఉపయోగించారు. రైడర్‌తో పాటు వెనక కూర్చున్న వారికి హ్యాండిల్స్ ఉన్నాయి. ఈ హ్యాండిల్స్ 2 ప్రత్యేక భాగాలుగా ఉన్నాయి. ఈ మొత్తం బైక్‌ను 3 కంపార్ట్‌మెంట్లుగా విభజించారు. దీనిలో 2-2 మంది ప్రయాణీకులు సులభంగా కూర్చోవచ్చు. చిన్న పిల్లలు ఏడు మంది వరకు కూర్చునే అవకాశం ఉంది. ఈ బైక్ అడుగున ఒక పొడవైన స్ట్రిప్ ఉంది. ఇది ఫుట్ రెస్ట్ లాగా పనిచేస్తుంది. బైక్ వెనుక భాగంలో బ్యాక్ రెస్ట్ కూడా అందించారు. దాని మధ్యలో రెండు పైపులు ఏర్పాటు చేశారు. వాటి పైన ఒక పెద్ద సోలార్ ప్లేట్ఉంచారు. ఈ ప్లేట్ ద్వారా బైడ్‌కు ఛార్జింగ్ అందడమే కాకుండా.. ప్రయాణికులందరికీ ఎండ నుంచి రక్షణ అభిస్తుంది. దీనికి స్పీడోమీటర్, LED లైట్, బ్రేక్ ఉన్నాయి. వీడియోలో బైక్ వేగం కూడా అద్భుతంగా కనిపిస్తోంది.
అమితాబ్ బచ్చన్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటుడి అభిమానులతో సహా సోషల్ మీడియా వినియోగదారులందరూ పిల్లల ఈ వీడియోను ఇష్టపడుతున్నారు. కాగా.. ఈ 7 సీట్ల ద్విచక్ర వాహనం వీడియో చాలా పాతది. ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇంతకు ముందు చాలాసార్లు కనిపించింది. ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!