ప్రేమకు వయస్సు లేదని అంటారు. ఇది ఏ వయసులోనైనా ఎవరికైనా పుట్టొచ్చు. యూపీలోని కాన్పూర్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మధ్య వయస్కురాలు మైనర్ అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి కూడా తన వయసులో మూడు రెట్లు ఎక్కువ వయసున్న మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆమెకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. అందులో పెద్ద కుమార్తెకు వివాహం కూడా జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మహిళ పిల్లలు ఎదురు తిరిగారు. అయినప్పటికీ.. వారి కలయిక కొనసాగింది.
బెంగళూరులోని ఏఐ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్యకు కేసు మరవక ముందే మరో కేసు బయటకు వచ్చింది. అతుల్ సుభాస్ మాదిరిగానే ఓ వ్యక్తి తన భార్య తనను వేధిస్తోందని వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు.
మతం పేరుతో జరుగుతున్న అణచివేతలు, దౌర్జన్యాలన్నీ మతంపై అవగాహన లేకపోవడం వల్లే జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని అమరావతిలో మహానుభావ ఆశ్రమ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. మత ప్రాముఖ్యతను అభివర్ణిస్తూ.. దానికి సరైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మతం ఎప్పటి నుంచో ఉందని, దాని ప్రకారమే అన్నీ పని చేస్తాయన్నారు. అందుకే దానిని "సనాతనం" అంటారన్నారు. మతం గురించి అసంపూర్ణ జ్ఞానం కలిగి ఉండటం అధర్మానికి దారితీస్తుందని మోహన్ భగవత్ తెలిపారు.…
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న పోలీసు వాహనం బోల్తా పడడంతో నలుగురు పోలీసులు గాయపడ్డారు. పాలీ జిల్లాలోని రోహత్, పానిహరి కూడలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ రైడర్‌ను రక్షించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో పోలీసు బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. కేబినెట్ మంత్రి ఒట్టారామ్ దేవాసి తల్లి ఇటీవల మరణించగా.. ఆయన్ని పరామర్శించడానికి వసుంధర రాజే పాలి జిల్లాలోని బాలికి వెళ్లారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కానింగ్‌లో అనుమానిత కాశ్మీరీ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. కాశ్మీర్, కోల్‌కతా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఈ అరెస్టు జరిగింది. ఆదివారం అనుమానిత ఉగ్రవాదిని అలీపూర్ కోర్టులో హాజరుపరిచారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల డిమాండ్ మేరకు కాశ్మీర్‌లోని నిషేధిత 'తెహ్రీక్-ఎ-ముజాహిదీన్' సంస్థకు చెందిన అనుమానిత సభ్యుడు జావేద్ మున్షీని డిసెంబర్ 31 వరకు ట్రాన్సిట్ రిమాండ్‌కు కోర్టు పంపింది.
బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సల్మాన్ ఖాన్ నుంచి షారుక్ ఖాన్ వరకు అందరి గురించి మాట్లాడారు. దీంతో పాటు మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ కంటే సంగీత స్వరకర్త ఆర్డి బర్మన్ గొప్పవాడని అన్నారు.
కువైట్ తన దేశ అత్యున్నత గౌరవంతో ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించింది. కువైట్ ఎమిర్ షేక్ మషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ కువైట్ అత్యున్నత పౌర పురస్కారం 'ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్' ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అందించారు. కువైట్-భారతదేశం మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి ఈ గౌరవం లభించింది. 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని కువైట్‌ను సందర్శించిన సందర్భంగా ఆయనకు ఈ గౌరవం దక్కింది.
ప్రధాని నరేంద్ర మోడీ కువైట్‌లోని గల్ఫ్ స్పీక్ లేబర్ క్యాంపును సందర్శించారు. అక్కడున్న భారతీయ కార్మికులతో సంభాషించారు. ఈ సందర్భంగా, భారతదేశంలో చౌకైన డేటా (ఇంటర్నెట్) ఉందన్నారు. ప్రపంచంలో ఎవరితోనైనా ఆన్లైన్లో మాట్లాడాలనుకుంటే, ఖర్చు చాలా తక్కువ అని ప్రధాని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కు కూడా తక్కువే అని తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో సవరణలపై కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ఎన్నికల సంఘం సంస్థాగత సమగ్రతను బలహీనపరిచే కుట్ర అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఈ దుస్సాహసం, పక్కా ప్రణాళికతో ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగా ఎన్నికల సంఘం చిత్తశుద్ధిని దెబ్బతీయడం రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని విమర్శించారు. వాటిని పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఖర్గే అన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించారు.. ఎన్నికల […]
యూపీలోని ఒరాయ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం మధ్యాహ్నం, కొత్వాలి ప్రాంతంలోని ఒక స్థానిక నివాసి తన కుమార్తె, కొడుకుతో కలిసి పోలీసు స్టేషన్‌కి వచ్చాడు. జూలై నెలలో తన భార్యను అదే ప్రాంతానికి చెందిన తన ఓ వ్యక్తి మోసగించి తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెళ్లేటప్పుడు రూ.40 వేల నగదు, రూ.2.5 లక్షల విలువైన నగలు కూడా తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన కూతురి పెళ్లి కోసం చేయించిన నగలు తెచ్చుకున్నానని బాధితుడు చెప్పుకొచ్చాడు. దీని వల్ల కూతురితో సంబంధం…