యూపీలోని బదౌన్‌లో బీజేపీ ఎమ్మెల్యే హరీష్ షాక్యా, అతని సోదరులు సహా 16 మందిపై సామూహిక అత్యాచారం, భూకబ్జాలకు పాల్పడినట్లు కేసు నమోదయ్యాయి. ప్రత్యేక కోర్టు, ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు, అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లీలు చౌదరి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బిల్సీ ఎమ్మెల్యే, ముఠాపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సివిల్ లైన్స్ కొత్వాలి పోలీసులు, ప్రాసిక్యూషన్ కార్యాలయం నుంచి న్యాయ సలహా తీసుకున్నారు.
క్రైస్తవుల అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్కు ముందు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చర్చిలను అలంకరించారు. ఈ నేపథ్యంలో ఓ చర్చిపై 'ఆలయం'(మందిర్) అని రాశారు. దీనికి హిందూ సంస్థల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొత్త వివాదం తలెత్తింది.
భార్య మార్పిడి, గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇచ్చిపుచ్చుకోవడం వంటి డర్టీ గేమ్‌లు కర్ణాటకలో బట్టబయలయ్యాయి. హరీష్, హేమంత్ అనే ఇద్దరు వ్యక్తులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అరెస్ట్ చేసింది. వీరిద్దరూ ప్రైవేట్ పార్టీ పేరుతో ఈ జుగుప్సాకరమైన గేమ్‌ను నడుపుతున్నారు. వీరు మహిళలను బలవంతంగా, బ్లాక్ మెయిల్ చేస్తూ దోపిడీ చేశారని తేలింది. ఓ మహిళ సీసీబీకి ఫిర్యాదు చేయడంతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది. బలవంతంగా శృంగారం చేసేలా ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. నిందితులు, వారికి తెలిసిన వారితో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలని…
ఇండియాలో పుట్టి అమెరికాలో ఐటీ కన్సల్టెన్సీ సర్వీసును విజయవంతంగా నడుపుతున్న ఓ వ్యక్తి పెళ్లి విడాకుల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 2020 నవంబర్‌లో అతని మొదటి భార్యకు రూ.500 కోట్లు భరణంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రస్తుతం అతని రెండవ భార్యకు రూ.12 కోట్లు ఇవ్వాలని ఆదేశించింది. 12 కోట్ల భరణాన్ని సముచితంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. రెండో భార్య అవసరాలు, పరిస్థితుల ఆధారంగా ఆమెకు భరణం ఇస్తున్నట్లు పేర్కొంది. భరణం యొక్క ఉద్దేశ్యం సామాజిక న్యాయం, గౌరవాన్ని కాపాడటమేనని స్పష్టం…
దేశంలో పాత వాహనాల మార్కెట్ గణనీయంగా పెరిగింది. చాలా కంపెనీలు పాత వాహనాలను తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.. ఈ పాత వాహనాల విక్రయంపై విధించే పన్నుకు సంబంధించి కీలక సమాచారం వెలువడింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశంలో ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సహా పాత వాహనాల అమ్మకాలపై పన్ను పెంచడానికి అంగీకరించారు. జీఎస్టీ12 శాతం నుంచి 18 శాతానికి పెంచేందుకు అంగీకారం కుదిరింది.
చెన్నైలో ఆన్లైన్ గేమ్ వ్యసనానికి సంబంధించిన కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల యువకుడు తన తల్లి క్యాన్సర్ చికిత్స కోసం వచ్చిన డబ్బుతో ఆన్లైన్లో రమ్మీ ఆడాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని తీవ్రంగా మందలించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు టెర్రస్‌పై ఉన్న టీవీ కేబుల్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తమిళనాడులోని అరుల్మిగు కంద స్వామి ఆలయంలో ఒక భక్తుడి ఐఫోన్ ప్రమాదవశాత్తు హుండీ (విరాళం పెట్టె)లో పడింది. దీంతో నిర్వాహకులు ఇది ఆలయ ఆస్తిగా ప్రకటించారు. హుండీలో ఏ వస్తువు పడితే అది దేవుడి సొత్తుగా పరిగణిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీంతో ఆ వ్యక్తి నెత్తికి చేతులు పెట్టుకోవాల్సి వచ్చింది. ఫోన్ తిరిగి రాకపోవడంతో ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
మీరు త్వరలో కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. ఈ వార్త మీ కోసమే. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 నాక్ కాబోతోంది. ఇది జనవరి 17 నుంచి 22 మధ్య భారత్ లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇతర ప్రముఖ కార్ల తయారీ కంపెనీల మాదిరిగానే, టాటా మోటార్స్ కూడా అనేక లైనప్‌లను ఆవిష్కరించబోతోంది. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో కంపెనీ టాటా సియెర్రా ఈవీని ఆవిష్కరించబోతోంది. దీని డిజైన్ ప్రత్యేకంగా ఉండబోతోంది. స్లిమ్ […]
దేశంలో పెద్ద నోట్లు రద్దయి ఏడేళ్లు దాటింది. ఈ నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదయ్యాయి. వాటిపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. డిమానిటైజేషన్‌ను సమర్థించింది. నోట్ల రద్దు తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉంది. కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. కొత్త రూ.500, రూ.2000 నోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన ఓ టీవీ న్యూస్ ఛానెల్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ఎక్స్…
ఏ వ్యక్తికైనా వివాహం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. పెళ్లి నిర్ణయం జీవితంపై ఆధారపడి ఉంటుంది. ఇకవేళ తప్పటడుగు వేస్తే జీవితాంతం భరించాల్సి ఉంటుంది. అలాంటి ఓ ఘటన చైనాలో జరిగింది. పెళ్లి కాకముందే ఓ చైనా వ్యక్తి మనోవేదనకు గురయ్యాడు. పెళ్లి గురించి ఆత్రుతగా ఉన్న అతను పెళ్లికి ముందే తన కాబోయే భార్య కోసం దాదాపు రూ.55 లక్షలు ఖర్చు చేశాడు. అయితే.. పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయికి ముందే పెళ్లయినట్లు తెలిసింది. దీంతో బిత్తర పోయాడు.