ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపే (మార్చి 10వ తేదీ) నామినేషన్లకు ఆఖరి రోజు. మొత్తం 5 స్థానాలు ఖాళీ అవ్వగా.. జనసేన, బీజేపీకి ఒక్కో సీటు ఇచ్చింది. జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన స్థానాలకు ఎవ్వరూ నామినేషన్ వేయలేదు. 8,9 తేదీల్లో శని, ఆదివారాలు కావడంతో అవకాశం లేదు. ఇక మిగిలింది 10వ తేదీ ఒక్కరోజే. తాజాగా టీడీపీ అభ్యర్థులను ఫైనల్ చేసింది. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడుకి టికెట్ కేటాయించింది.
కాగా.. ఇప్పటికే ఒకస్థానాన్ని జనసేనకు కేటాయించిన టీడీపీ.. మూడు స్థానాల్లో మాత్రమే పోటీ చేయనుంది. జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు పిఠాపురం వర్మకు ఈసారికి అవకాశం లేదని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. టీడీ జనార్దన్, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, పార్టీ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ మాల్యాద్రి, మాజీ మంత్రి జవహర్‌కి ఈసారికి అవకాశం లేదన్న హైకమాండ్ తెలిపింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు పై ఉత్కంఠ కొనసాగింది. కొంత మందికి మాత్రం కొంత మందికి ఫోన్ చేసి సారీ చెప్పింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి కొద్దిగా టైట్ గా ఉందని అర్థం చేసుకోవాలని కొంతమంది ఆశావహులకు ఫోన్లు వెళ్లాయి..
మరోవైపు.. ఈసారి బీజేపీకు ఒక సీటు ఇచ్చినందున సర్దుబాటు చేయలేకపోతున్నామని, 2027లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడుతున్నందున అప్పుడు అవకాశం కల్పిస్తామని ఆశావహులకు పార్టీ పెద్దలు సర్ది చెబుతున్నారు. పలువురికి అధిష్ఠానం నుంచి ఫోన్లు వెళ్లినట్టు సమాచారం.