తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మృతి చెందారు.. 1978 నుంచి 2006 వరకు టీటీడీలో ఆస్థాన గాయకుడిగా కొనసాగారు. 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. “వినరో భాగ్యము విష్ణుకథ..”, “జగడపు చనువుల జాజర..”, “పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు..” వంటి సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు సమకూర్చారు.సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పాటలు పాడారు. గత శుక్రవారమే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆయన మరణ వార్త బయటకు వచ్చింది.
READ MORE: TDP: ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన టీడీపీ అధిష్టానం
గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. గరిమెళ్ల మృతి చెందారన్న వార్త బాధ కలిగించిందన్నారు. సంగీత ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు. గరిమెళ్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన లోకేశ్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఓ పోస్టు చేశారు. మరోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కూడా విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం సంప్రదాయ సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.