దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు భారీ కుట్ర భారీ కుట్ర పన్నిన ఓ గ్యాంగ్‌ని పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల అరెస్టయిన అన్సార్-అల్-ఇస్లామ్ బంగ్లాదేశ్‌కు చెందిన ఎనిమిది మంది అనుమానిత సభ్యులను అరెస్ట్ చేశారు. వీళ్లు 'చికెన్ నెక్'పై దాడి చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు పోలీసు ఓ ఉన్నతాధికారి సమాచారం అందించారు. 'చికెన్ నెక్' అనేది పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే కారిడార్. సిలిగురి కారిడార్‌లో వరుస దాడులు చేసి.. పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించాలన్నది వీళ్ల ప్లాన్.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కొత్త హెయిర్ స్టైల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ట్రంప్ గతంలో కంటే చాలా డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తున్నారు. ఆయన లుక్‌కి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఫ్లోరిడాలోని ట్రంప్ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ 'ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్' నుంచి వచ్చింది. ఆయనను మద్దతుదారులు సాదర స్వాగతం పలికారు. ట్రంప్ హృదయపూర్వకంగా ప్రతిస్పందించడం వీడియోలో కనిపిస్తుంది. దీనిని చూసిన నెటిజన్లు స్పందించారు. కాగా.. తాజాగా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్…
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ప్రముఖ ఎస్యూవీ గ్రాండ్ విటారాలో 7-సీటర్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 7-సీటర్ గ్రాండ్ విటారా వచ్చే ఏడాది అంటే 2025 మధ్యలో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. వార్తా వెబ్సైట్ gaadiwaadi కథనం ప్రకారం.. వచ్చే ఏడాది కచ్చితంగా ఈ కారు భారత మార్కెట్లోకి రానుంది. దీనికి సంబంధించిన పరీక్షలు నడుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడల్ […]
మారుతి సుజుకి తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ సెలెరియో లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించింది. దీంతో పాటు ఈ ఎడిషన్‌కు రూ.11,000 విలువైన ఉచిత యాక్సెసరీలు అందిస్తున్నారు. ఇది గతంలో ప్రారంభించిన డ్రీమ్ సిరీస్ ఆధారంగా రూపొందించారు. ఇందులో కాస్మెటిక్, ఫీచర్ అప్గ్రేడ్లు కూడా చేశారు. దాని వివరాలను తెలుసుకుందాం.
2024 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. మరి కొన్ని రోజుల్లో ఈ ఏడాది ముగుస్తుంది. 2024 ఆటోమొబైల్ పరిశ్రమకు ఎన్నో జ్ఞాపకాలను అందించింది. అయితే.. ఈ సంవత్సరం కొన్ని కంపెనీలు, వాటి మోడళ్లకు చాలా నిరాశపరిచాయి. ఈ12 నెలల వ్యవధిలో 12 మంది కస్టమర్లు కూడా కొనని ఓ కారు ఉంది. అవును... మీరు నమ్మకపోయినా ఇది నిజం. దాని పేరు.. Citroen C5 Aircross.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారేందుకు కొందరు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. తరచుగా రీల్స్‌లో ఏదో ఒక వింత లేదా భయానక స్టంట్స్ చేయడం చూస్తునే ఉంటాం. కొన్ని వింతగా మరి కొన్ని నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక అమ్మాయి కుక్క పాలు తాగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోపై జనాలు రకరకాల కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఎక్స్‌లోని కొన్ని హ్యాండిల్స్ ఈ వీడియో, స్క్రీన్షాట్లను కూడా షేర్ చేస్తున్నారు. ఈమె…
బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 12 ఏళ్ల క్రితం మహిళ ప్రేమ వివాహం చేసుకుంది. 12 ఏళ్ల తర్వాత ఆ మహిళ మరొకరితో ప్రేమలో పడింది. ఈ విషయం మహిళ భర్తకు తెలియడంతో.. మొదట ఆగ్రహానికి గురయ్యాడు. తర్వాత వారిద్దరికీ పెళ్లి జరిపించాడు. ఈ మొత్తం విషయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో 'డిజిటల్ మోడల్' చిత్రాలు వైరల్ అవుతున్నాయి. మనకు తగినంత నిద్ర లేకపోతే 2050 నాటికి మనుషులు ఎలా ఉంటారో ఆ చిత్రాల ద్వారా చెబుతున్నారు. బ్రిటిష్ కి చెందిన స్లీప్ ఎక్స్పర్ట్ డాక్టర్ సోఫీ బోస్టాక్ సహాయంతో బెన్సన్స్ ఫర్ బెడ్స్ అనే సంస్థ.. ఈ పరిశోధన చేసింది. స్త్రీ శరీరం సాధారణంగా రాత్రికి ఆరు గంటలపాటు నిద్రపోతే ఆమె 25 ఏళ్లలో ఎలా మార్పు చెందుతోందో డిజిటల్ చిత్రాల ద్వారా తెలిపారు.
రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. వచ్చే సంవత్సరం నుంచి ఈ మందులు రష్యన్ పౌరులకు ఉచితంగా అందించనున్నారు. ఈ వ్యాక్సిన్‌ను కేన్సర్ రోగులకు వేయబోమని, క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తుగా వేస్తామని తెలిపారు. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ జనరల్ ఆండ్రీ కప్రిన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల పార్లమెంట్లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో పార్లమెంటు లోపలా, వెలుపలా విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు.