రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిరుద్యోగ యువతకి ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రూ. 6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించనున్నారు. సంక్షేమ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ల ద్వారా నిరుద్యోగ యువతకి మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు సాయం చేయనున్నారు. మార్చి 15 నుంచి దరఖాస్తుల స్వీకరిస్తారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
READ MORE: Sambhaji Maharaj: శంభాజీ మహరాజ్‌కి అబూ అబ్మీ నివాళి.. ఔరంగజేబును పొగిడిన కొన్ని రోజులకే..
ఇదిలా ఉండగా.. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, మంత్రుల సమావేశం జరిగింది. ఆయా శాఖలకు బడ్జెట్ లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈనెల 19 లేదా 20న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి మూడు లక్షల 20 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టె అవకాశం ఉంది. మార్చి 29 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించనున్నట్లు సమాచారం.
READ MORE: Sambhaji Maharaj: శంభాజీ మహరాజ్‌కి అబూ అబ్మీ నివాళి.. ఔరంగజేబును పొగిడిన కొన్ని రోజులకే..