జనగామ జిల్లా కేంద్రంలో ఇటీవలే కిడ్నప్ కు గురైన 10 నెలల పసి పాప శివాని కేసును జనగామ పోలీసులు ఛేదించారు. పాపను కిడ్నప్ చేసిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పాపను సురక్షితంగా తన తల్లిదండ్రులకు అప్పగించారు. ఏసీపీ పండేరి చేతన్ నితిన్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన రామ్ జూల్ – పార్వతి దంపతులు జిల్లా కేంద్రంలో కూలి పని చేస్తూ జీవన కొనసాగిస్తున్నారు.. వారి చిన్న కుమార్తె 10 నెలల శివానిని అక్కడే పని చేసిన దంపతులు ఫిబ్రవరి 25న కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న పోలీసులు పిల్లలు లేని వారికి పాపను అమ్మే ప్రయత్నం చేస్తుండగా కిడ్నాపర్లను పట్టుకొని అరెస్ట్ చేశారు… తమ పాపని క్షేమంగా తమకు అప్పజెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఏసీపీ అభినందించారు..
READ MORE: TG Govt: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. స్వయం ఉపాధి పథకం కింద రూ.5లక్షలు!
సీసీ కెమెరాల ఆధారంగా వారిని పట్టుకున్నారు. ఈ కేసు వివరాలపై ఏసీపీ మాట్లాడుతూ.. “విజయవాడకు చెందిన చంద్రమ్మ అనే మహిళతో కలిసి పిల్లలు లేని వారికి పాపను అమ్మే యోచనలో నిందితులు కిడ్నాప్ కు పాల్పడ్డారు. జనగామ, హైదరాబాద్ జాతీయ రహదారి పెంబర్తి గ్రామం వద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా నిందితులు పోలీసులకు చిక్కారు. గతంలోనూ వీరిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం బెయిల్‌పై వచ్చి ఈ కిడ్నాప్ కి పాల్పడ్డారు.” అని ఏసీపీ తెలిపారు.
READ MORE: BOI Recruitment 2025: సమయం లేదు మిత్రమా.. డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? 400 బ్యాంక్ జాబ్స్ రెడీ
Tags: