కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులు, ఎయిర్ పోర్టుల నిర్మాణం గురించి కేంద్రమంత్రులతో చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్రమంత్రిని కోరినట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.”రెండు నెలలలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని గడ్కరీ చెప్పారు. 95 శాతం భూసేకరణ పూర్తయింది. కేబినెట్ అప్రూవల్ వచ్చాక పరిహారం ఇస్తామన్నారు. హైదరాబాద్-విజయవాడ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవాలని కోరాం. రెండు ప్యాకేజీలు గా రోడ్డు నిర్మాణం జరిపేందుకు టెండర్లు పిలిచేందుకు అధికారులు గడ్కరీ ఆదేశాలిచ్చారు. శ్రీశైలం ఎలివెటెడ్ కారిడార్ ను వేగవంతం చేయాలని కోరాం. అటవీ భూములు, అనుమతులు రావాల్సి ఉన్నందున ప్రత్యేక సమావేశం పెట్టాలని అధికారులకు గడ్కరీ సూచించారు. సోమశిల కేబుల్ బ్రిడ్జి టెండర్లు పిలిచెందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.” అని మంత్రి వెల్లడించారు.
READ MORE: MP: ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవాల్లో ఘర్షణ.. నిందితులకు గుండు గీయించి, ఉరేగించిన పోలీసులు..
పర్వత మాల ప్రాజెక్టు కింద 5 రోప్ వేలు అడిగినట్లు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. “రామ్మోహన్ నాయుడు తో మామునూరు ఎయిర్ పోర్టు గురించి చర్చ జరిపాం. మామునూరు ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. జీఎంఆర్ నుంచి ఎన్ ఓసి తీసుకున్నాం. మరికొన్ని అనుమతులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. రెండున్నరేళ్లలో మా ఎయిర్ పోర్టు పూర్తి చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. కొత్తగూడెం, రామగుండం పెద్దపల్లి ఎయిర్ పోర్ట్, ఆదిలాబాద్, నిజామాబాద్ జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టు ఫిజబిలిటి పరిశీలించాలని ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులను కేంద్రమంత్రి ఆదేశించారు. మామునూర్ ఎయిర్ పోర్టుకి 15 రోజుల్లో భూసేకరణ పూర్తవుతుంది. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి వారం పదిరోజుల్లో టెండర్లు పిలుస్తాం. పాఠౌడి హౌస్‌లో అన్ని సదుపాయాలతో తెలంగాణ భవన్ నిర్మిస్తాం. డిజైన్లు సీఎం ముందుంచాం. అన్ని సదుపాయాలతో ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం ఉంటుంది.” అని మంత్రి వ్యాఖ్యానించారు.