మొన్న సంగారెడ్డి, నిన్న మెదక్, నేడు సిద్దిపేట జిల్లాలో కోళ్లు మృతి కలకలం సృష్టిస్తోంది. బ్రాయిలర్, లేయర్, నాటుకోళ్లు అనే తేడా లేకుండా వరుసగా కోళ్లు మృతి చెందుతున్నాయి. వర్గల్ (మం) మజీద్ పల్లి గ్రామంలోని పౌల్ట్రీఫామ్ లో రెండ్రోజుల్లో 10 వేల కోళ్ల మృత్యువాత పడ్డాయి. వెటర్నరీ అధికారులు కోళ్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపారు. ఏ రోగంతో చనిపోతున్నాయో తెలియక పౌల్ట్రీఫామ్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాకే కోళ్ల మృతిపై క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు.
READ MORE: Shekar Master : బూతు స్టెప్పులకు బ్రాండ్ అంబాసిడర్ గా శేఖర్ మాస్టర్ ?
ఇదిలా ఉండగా.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని గ్రామాల్లో గత శనివారం 10 వేల కోళ్లు అంతుచిక్కని వ్యాధితో మృతి చెందాయి. గవ్వపల్లి, జంగరాయి గ్రామాల్లోని కోళ్ల ఫాంలలో కళ్ల ఎదుటే వ్యాధికి గురైన కోళ్లు మృతి చెందడంతో ఫాంల యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. వైరస్ సోకడంతో వారం రోజుల నుంచి భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయని వాటి పోషణదారులు సంగెం జనార్ధన్, ఆరె యాదగిరి, మినిపూరి భూపాల్‌రెడ్డి వాపోయారు. మెదక్ జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాధితో కోళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతి చెందిన కోళ్లను భూమిలో పూడ్చేశారు. రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.
READ MORE: IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్.. టీమిండియా యువ బౌలర్ ఔట్!