గంజాయి డాన్ అంగూరు భాయ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఎన్నిసార్లు అరెస్టు చేసిన బెయిల్ పై వచ్చి గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న అంగూరు భాయ్.. ప్రస్తుతం చంచల్ గూడ జైళ్లో ఉంది. దూల్పేట్ సీఐ మధుబాబు.. అంగూర్ భాయ్‌కి పీడీ జీవోను అందించారు. రాష్ట్రం కాని రాష్ట్రంలోకి వచ్చి.. తెలంగాణలోని దూల్పేట్‌లో స్థిరపడి.. గంజాయి డాన్‌గా ఎదిగిన అంగూర్ భాయ్‌పై ఎక్సైజ్ శాఖ సిఫారసు మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం పీడీ యాక్ట్ ఆదేశాలు జారీ చేశారు. తనతో పాటు కుటుంబ సభ్యులు మొత్తంగా గంజాయి వ్యాపారంలో మునిగితేలింది.
READ MORE: KCR: రేపు అసెంబ్లీకి కేసీఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక ఆదేశాలు..
ఈ కుటుంబంపై ఎన్ని సార్లు కేసులు పెట్టినా తిరిగి బెయిల్ పై వచ్చి గంజాయి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉండడంతో ఇలాంటి క్రిమినల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమల్ హాసన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల మేరకు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, దూల్పేట్ ఎస్టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి పీడీ యాక్ట్‌ను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను చంచల్ గూడ జైల్లో ఉన్న అంగూర్ భాయ్ కి దూల్పేట్ సీఐ మధుబాబు అందించారు. అంగూరు భాయ్ పై 30 గంజాయి అమ్మకాల కేసులు ఉన్నాయి. 20 ఎక్సైజ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలోనూ, మరో 10 సివిల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి.