స్విఫ్ట్ కారు ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎంజీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎంజీఐటీ కాలేజ్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న.. 6గురూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈరోజు డుమ్మా కొట్టారని తెలిపారు. “ఒక్కసారి స్టూడెంట్స్ కాలేజ్ లోనికి వచ్చారంటే బయట వెళ్ళడానికి వీలులేదు. నార్సింగి మూవీ టవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని మధ్యహ్నం 3:30 గంటలకు సమాచారం అందింది. వెంటనే మేము స్పాట్ వచ్చాము. అప్పటికే నలుగురు తీవ్ర గాయాల అయ్యాయి. స్విఫ్ట్ కారు TS09EG4929 విద్యుత్ స్తంభాన్ని డి కొట్టారు పల్టీలు కొట్టి ఫుట్పాత్ పైకి వచ్చి ఆగినట్టుంది. హై స్పీడ్ వెళ్ళాలని ఆతృతతో స్టూడెంట్ కార్ డ్రైవ్ చేసినట్లుంది. పేరెంట్స్ శోకాన్ని మిగిల్చింది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అయింది.” అని ప్రిన్సిపాల్ వ్యాఖ్యానించారు.
READ MORE: Pakistan: పాక్‌లో బీఎల్ఏ వీరంగం.. రైలు హైజాక్.. 100 మందికి పైగా పాక్ సైనికుల బందీ..
ఇదిలా ఉండగా.. నార్సింగి మూవీ టవర్ వద్ద ఘటన చోటు చేసుకుంది. ఓ కారు అతివేగంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. అదే కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారులో ప్రయాణిస్తున్న విద్యార్థులంతా ఎంజీఐటీ కళాశాలకు చెందిన వివేక్ రెడ్డి, హీమ్ సాయి, శ్రీకర్, సృజన్, కార్తికేయ, హర్షవర్ధన్ గా గుర్తించారు. గండిపేట్ కళాశాల నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న 6 మంది విద్యార్థులు కారులో ఉన్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
READ MORE: Konda Surekha: జోగులాంబ ఆలయ పూజారిపై క్రిమినల్ కేసులు.. విచారణకు మంత్రి కొండా సురేఖ ఆదేశం