Konda Surekha: జోగులాంబ ఆలయ పూజారిపై క్రిమినల్ కేసులు.. విచారణకు మంత్రి కొండా సురేఖ ఆదేశం
- జోగులాంబ ఆలయ పూజారి ఆనంద్ శర్మపై క్రిమినల్ కేసులు
- ఆనంద్‌ను తొలగించాలని ఆందోళన
- దేవాదాయ శాఖ కార్యాలయం ముందు నిరసన
- స్పందించిన మంత్రి కొండా సురేఖ
- పూజారిపై విచారణకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, ఈఓ పురేందర్ అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ దేవాదాయశాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. హైదరాబాద్ బొగ్గులకుంటలో జరిగిన ఈ ఆందోళనకు కొత్తకోట ఆశ్రమ అర్చకుడు శివానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శక్తిపీఠాలలో ఒక పీఠం అయిన అలంపూర్ జోగులాంబ ఆలయ పవిత్రతను కాపాడాలన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ పై క్రిమినల్ కేసులు ఉన్నందున.. వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా ఆనంద్ శర్మపై ఆరోపణలు వస్తున్నా.. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆందోళనలో పాల్గొన్న వారు మండిపడ్డారు.
READ MORE: Minister Narayana: వైసీపీ వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు..
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
ఆలయం లోని ఆభరణాల మాయం, పూజారి, ఈవోల అవినీతి పై ప్రభుత్వ సమగ్ర విచారణ జరిపితే.. నిజాలు బయట పడతాయన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మినిస్టర్ క్వార్టర్స్ లో దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. వెంటనే పూజారి ఆనంద్ శర్మను విధుల నుంచి తప్పించాలని కోరారు. అరగంటపాటు అర్చకులు, స్వామిజీలు చెప్పిన విషయాలు విన్న మంత్రి కొండ సురేఖ ఆలయ ప్రతిష్టను కాపాడతామని హామీ ఇచ్చారు. ఆనంద్ శర్మపై విచారణకు ఆదేశించారు. తక్షణం విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కమిషనర్‌ను ఆదేశించారు.
READ MORE: Hyderabad : గుడిలో శివ పార్వతల విగ్రహాలు ఎత్తుకెళ్లిన అక్కాచెల్లెల్లు.. ఎందుకిలా చేశారంటే?
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!