Raja Singh: రాజమౌళి ప్రతి సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. ఇటీవల ఓ ఈవెంట్లో భాగంగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై తాజాగా రాజాసింగ్ స్పందించారు. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోందన్నారు.. తన అమ్మానాన్నలకు హనుమంతుడిపై విశ్వాసం ఉంది కానీ.. తనకు లేదని రాజమౌళి అన్న మాటలను రాజాసింగ్ గుర్తు చేశారు. నీకు విశ్వాసం లేదు కానీ.. అదే ధర్మం, దేవుళ్లపై సినిమాలు చేసి.. రూ. కోట్లల్లో సంపాధించుకున్నావు కదా..? అని ప్రశ్నించారు.…
YV Subba Reddy: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని వైవీ సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారుల బృందం చేరుకుంది. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఆయన ఇంట్లోనే విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి పీఎ చిన్న అప్పన్నతో పాటు టీటీడీ మాజీ ఈవో, పలువురు అధికారులను విచారించింది సిట్.. వారి స్టేట్మెంట్ల ఆధారంగా వైవీ సుబ్బారెడ్డిని విచారిస్తోంది. సిట్ అధికారులు స్టేట్మెంట్స్ తో పాటు పలు డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు. వాటిని…
Aishwarya Rai: సత్యసాయి శతజయంతికి తనను ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నానని నటి ఐశ్వర్య పేర్కొన్నారు.. సత్యసాయి బోధనలు ప్రపంచానికి మార్గదర్శనం చేశాయన్నారు.. సత్యసాయి ట్రస్ట్ ఎన్నో విద్యా సంస్థలు పెట్టి పేదలకు ఉచిత విద్య అందిస్తోందని కొనియాడారు. తాజాగా సత్యసాయి శతజయంతి ఉత్సవ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్ ప్రసంగించారు. ప్రజలకు సత్యసాయి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
Sachin Tendulkar: సత్యసాయి బాబా బోధనలు నాలో ఎంతో ప్రేరణను ఇచ్చాయని.. ఐదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు తన వెంట్రుకలు సత్యసాయిలా ఉన్నాయనే వారని మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తెలిపారు.. తమ మదిలో ఎన్నో ప్రశ్నలకు బాబా దగ్గర సమాధానాలు దొరికాయన్నారు.. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో సచిన్ మాట్లాడారు. బాబా బోధనలు తనను మార్గదర్శనం చేశాయని.. బాబా ఆశీస్సులతో జీవితంలో ఎన్నో సాధించానని చెప్పుకొచ్చారు. ప్రజలను ఎప్పుడు జడ్జ్ చేయొద్దని వారిని అర్థం చేసుకోవాలని బాబా నాతో చెప్పారు. దీని వల్ల…
Election Commission: దేశవ్యాప్తంగా 272 మంది ప్రముఖులు ఎన్నికల సంఘానికి మద్దతుగా బహిరంగ లేఖ విడుదల చేశారు. వీరిలో 16 మంది మాజీ న్యాయమూర్తులు, 123 మంది రిటైర్డ్ అధికారులు, 14 మంది మాజీ రాయబారులు, 133 మంది మాజీ సైనిక అధికారులు ఉన్నారు. కాంగ్రెస్, ప్రతిపక్ష నాయకులు ఎన్నికల సంఘంపై చేసిన నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తూ లేఖ రాశారు. ఎన్నికల సంఘంతో సహా రాజ్యాంగ సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు పదే పదే కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని లేఖలో ఆరోపించారు.
Kerala: కేరళలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తిరువనంతపురం నుంచి 16 ఏళ్ల బాలుడిని అతని తల్లి, సవతి తండ్రి ఇస్లామిక్ స్టేట్లో చేరమని ఒప్పించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, UAPA కింద కేసు నమోదు చేశారు. అంతే కాదు.. తన తల్లి ఏకంగా ISISలో చేరాలని.. ఆ భావజాలాన్ని పెంపొందించుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Mallojula Venu Gopal: మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల వేణు గోపాల్ మరో వీడియో విడుదల చేశారు. "మావోయిస్టులు లోంగిపోవాలని కోరుతున్నా.. పరిస్థితులు మారుతున్నాయి.. దేశం కూడా మారుతోంది.. ఎన్ కౌంటర్లో మావోలు ప్రాణాలు కోల్పోతున్నారు.. హిడ్మాతో పాటు మావోలు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు.. మావోలు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. అందుకే మావోలు లోంగిపోవాలని కోరుతున్నా.. లోంగిపోవాలనుకునేవాళ్లు నాకు ఫోన్ చేయండి.. నా నంబర్ 8856038533.." అని వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోను గడ్చిరోలి పోలీసులు విడుదల చేశారు.
Mahbubnagar Tragedy: మహబూబ్నగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. జీవన పోరాటంలో అలసిపోయిన ఓ తండ్రి.. మృతిచెందిన తన కుమారుడికి అంత్యక్రియలు సైతం చేసే దుస్థితి లేక.. కొట్టుమిట్టాడుతున్న ఘటన కలచివేసింది. ఈ హృదయవిదారక ఘటన అందరినీ కన్నీరు పెట్టించింది.. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..
Blood Pressure: తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమవుతోంది. తాజా పరిశోధనలు, వైద్యుల వివరాల ప్రకారం.. శరీరంలో నీరు తగ్గితే రక్తంలో సోడియం స్థాయిలు పెరిగి, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది. ఇజ్రాయెల్లో జరిగిన ఓ పరిశోధన రిపోర్టు విడుదలైంది. ఇందులో నాలుగు లక్షల మందికి చెందిన ఆరోగ్య వివరాలను పరిశీలించారు. రక్తంలో సోడియం మోతాదు పెరిగితే రక్తపోటు, గుండె వైఫల్యం ప్రమాదం పెరుగుతుందని గుర్తించారు. సోడియం మోతాదులు 143 ఎంఎంఓఎల్/ఎల్ దాటినప్పుడు హైబీపీ ముప్పు…