Off The Record: అమరావతి రైతుల గురించి కూటమి పార్టీల మధ్య కొత్త చర్చలు నడుస్తున్నాయి. ఇన్నాళ్ళు మనోళ్ళు అనుకున్న రైతుల వాయిస్ మెల్లిగా పెరుగుతుండటం ప్రభుత్వ పెద్దల్ని కంగారు పెడుతున్నట్టు తెలుస్తోంది. రాజధానిలోని కొందరు రైతులు తమ సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ… ఏకంగా ముఖ్యమంత్రినే ప్రశ్నించారు. కొంత కాలంగా రాజధాని ప్రాంతంలో తాము పడుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. తమను సీఆర్డీఏ అధికారులు వేధిస్తున్నారని, సమస్యలపై వెంటనే దృష్టి పెట్టాలని డిమాండ్ […]
Marijuana Addiction: గంజాయి విక్రయాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. పట్టణాల్లోనే కాకుండా పల్లెలకు కూడా గంజాయి మత్తు పాకుతోంది. ఫలితంగా చాలా మంది విద్యార్థులు, యువత దీనికి అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడం వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వివిధ మార్గాల్లో ఈ ప్రాంతానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అయితే.. ఈ గంజాయి గురించి తాజాగా ఓ కీలక విషయం బయటకు వచ్చింది.
TG NEWS: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది.. 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తయింది.. స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు రిజర్వ్ చేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ల స్పీకర్ విచారణ ఇంకా పూర్తి కాలేదు.. రేపో, ఎల్లుండో కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పీకర్ ముందుకు రానున్నారు.
Madhavi Latha: రాజమౌళి దేవుణ్ణి అడ్డంగా పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నారని బీజేపీ నాయకురాలు మాధవి లత పేర్కొన్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నమ్మకాన్ని వ్యాపారంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. హిందువులు తేరగా దొరుకుతున్నారా? రాముడికి ఒకే పెళ్లాం ఉంది అంటున్న రాజమౌళికి ఎంతమంది పెళ్లాలు ఉన్నారు? అని ప్రశ్నించారు. కర్మ ఫలితం అనుభవించాడు కాబట్టే ఆంజనేయుడు లేడని అన్నాడు.. సినిమా చూసే మా వాళ్లకు బుద్ధి ఉండాలని హిందువులను ఉద్దేశించి అన్నారు. వందల కోట్లు సంపాదించిన నీవు.. బాహుబలి సినిమాకి పనిచేసిన వారికి ఏమైనా ఇచ్చావా?…
Bandi Sanjay: బండి సంజయ్‌పై టెన్త్ పేపర్ లీక్ కేసు నమోదైన విషయం తెలిసిందే.. ఈ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును తొలగిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ.. "టెన్త్ పేపర్ లీక్ కేసును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం.. చేయని తప్పుకు నన్ను జైలుకు పంపారు.. మానవత్వం మరిచి నాపట్ల, బీజేపీ కార్యకర్తలపట్ల క్రూరంగా వ్యవహరించారు.. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నన్ను రోడ్లపై తిప్పుతూ ఏదో చేద్దామనుకున్నారు.. కార్యకర్తల ధాటికి తట్టుకోలేక జైలుకు…
Harish Rao: సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. సిగాచి బాధితులకు ఇచ్చిన కోటి పరిహారం హామీ ఏమైంది? ఇచ్చింది 26 లక్షలే.. ప్రభుత్వం బాకీ పడింది 74 లక్షలు.. ఇది ముఖ్యమంత్రి మాట తప్పడం కాదా? అని ప్రశ్నించారు. కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ డబ్బులను కూడా ప్రభుత్వం ఇప్పించే నష్టపరిహారంలో చూపించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నిస్సిగ్గుగా "బాధితులకు రూ. 40 నుంచి 50 లక్షలు అందించాం"…
CM Revanth Reddy: తెలంగాణలో అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందని.. దేశమంతటా ఈ పథకాన్ని విస్తరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని సీఎం వివరించారు. దీంతో పీడీఎస్ బియ్యం రీ సైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లోనూ ధరలు స్థిరపడ్డాయని చెప్పారు. ప్రజలు తినే బియ్యాన్ని పంపిణీ చేయటంతో ఈ పథకం ఆశించిన లక్ష్యం…
Vikarabad Murder Case: వికారాబాద్ పట్టణంలో సంచలనం సృష్టించిన జంట హత్య కేసులో కోర్టు కీలక తీర్పును వెలువరించింది. భార్యతో పాటు ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసిన భర్తకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. పోలీసుల సమాచార ప్రకారం.. 32 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి ప్రవీణ్ కుమార్.. వికారాబాద్‌లోని నివాసం ఉంటున్నాడు. గత కొన్నేళ్ల కిందట వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో తన భార్య చాందినీపై దాడికి పాల్పడ్డాడు. భార్యతో ఘర్షణ సందర్భంగా మొదట ఇనుప రాడ్డుతో ఆమెను, ఐదేళ్ల కుమార్తె…
India Russia Relations: భారత్, రష్యా మధ్య సంబంధాలు ప్రస్తుతం గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలని పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఎంత ఒత్తిడి తెచ్చినా భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపడం లేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్ని సుంకాలు విధించిన భారత్ తగ్గేదేలే అంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా భారత్‌లోని రష్యా రాయబారి కీలక ప్రకటన చేశారు.
Keerthy Suresh: ఇటీవలి కాలంలో కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. అది మన జీవితాలను సులభతరం చేస్తూనే, మరోవైపు తీవ్రమైన సమస్యలను సృష్టిస్తోంది. ముఖ్యంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ, మార్ఫింగ్ ఫోటోలు, నకిలీ వీడియోలు సినీ నటీనటుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా ఈ సమస్య గురించే ప్రసిద్ధ నటి కీర్తి సురేష్ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసింది.