బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నటుడు ఆమిర్ ఖాన్ అభిమానులకు రేపు చాలా ప్రత్యేకమైన రోజు. ఒకవైపు.. దేశం మొత్తం రేపు హోలీ రంగులలో మునిగిపోతుండగా మరోవైపు, ఆమిర్ తన 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. రేపు అంటే మార్చి 14న అమీర్ పుట్టినరోజు. ఈ నటుడు తన పుట్టినరోజుకు ఒక రోజు ముందు ముంబైలో అభిమానులు, ఫొటో గ్రాఫర్లతో కలిసి తన పుట్టినరోజును జరుపుకున్నాడు. విలేకర్లు, ఫొటోగ్రాఫర్ల ఎదుట కేక్ కట్ చేసి వారికి తినిపించాడు.
READ MORE: Ponnam Prabhakar : మహేశ్వర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
అనంతరం ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్ గురించి సమాచారం ఇచ్చాడు. మహాభారత్ మీద సినిమా చేయడమంటే ఒక యజ్ఞంతో సమానం అని గతంలో కూడా ఆమిర్ ఖాన్ తెలిపాడు. ఈ ప్రాజెక్టును శ్రద్ధ, భయంతో పూర్తి చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలిపాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మహాభారత్ నా డ్రీమ్ ప్రాజెక్ట్. దీనిని పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు పనులు ప్రారంభిస్తున్నాం. స్క్రిప్ట్ వర్క్ మొదలు పెడుతున్నాం. ఇందు కోసం ఒక బృందాన్ని నియమించే పనిలో పడ్డాం. చాలా అంశాల గురించి అన్వేషణ మొదలు పెట్టాం. చివరికి ఏం జరుగుతోందో వేచి చూడాలి. ’’ అని పేర్కొన్నాడు.
READ MORE: Alia Bhatt: కూతురు ఫొటోలు తొలగించడంపై ఆలియా భట్ క్లారిటీ..