ప్రస్తుతం పాకిస్థాన్ అన్ని వైపుల నుంచి అవమానాలు ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్‌లో జరిగిన రైలు హైజాక్ సంఘటనపై ఒకవైపు రష్యా, ఆఫ్ఘనిస్తాన్ వంటి స్నేహపూర్వక దేశాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు, పాకిస్థాన్ వైఖరిపై భారత్ కూడా మండిపడింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్‌లో భారతదేశ ప్రమేయం ఉందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ చేస్తున్న ఈ నిరాధారమైన అర్థంలేని ప్రచారాన్ని భారతదేశం తీవ్రంగా తిరస్కరించింది.
READ MORE: Donald Trump: నార్త్ కొరియా కిమ్‌తో నాకు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయి
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. “పాకిస్థాన్ చేసిన నిరాధారమైన ఆరోపణలను మేము పూర్తిగా తిరస్కరిస్తున్నాం. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడ ఉందో ప్రపంచం మొత్తానికి తెలుసు. పాకిస్థాన్ ఇతరులపై వేలు చూపించడం మానేసి.. తన అంతర్గత వైఫల్యాలను చక్కదిద్దుకుంటే మంచిది.” అని పేర్కొన్నారు.
READ MORE: Group-3 Results: అలర్ట్.. గ్రూప్ 3 ఫలితాలు విడుదల
పాకిస్థాన్ చేసిన ఆరోపణలు ఏంటి?
బలోచిస్థాన్‌లో జరిగిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై రైలు హైజాక్ ఘటనపై పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్‌ఖత్ అలీఖాన్ గురువారం మీడియాతో మాట్లాడారు. తిరుగుబాటుదారులు ఆఫ్ఘనిస్తాన్‌లోని వారి సూత్రధారులతో సంప్రదింపులు జరుపుతున్నారని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో భారతదేశం ప్రోత్సహిస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. పొరుగుదేశాల్లో అస్థిరత నెలకొల్పేందుకు ప్రయత్నిస్తూ, ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండకు పాల్పడుతోందని అన్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలను భారత్ తిప్పి కొట్టింది.