యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ ‘దిల్ రూబా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఇది 10వ సినిమా. దీనిని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ , ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మించాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ఈ సినిమాను రూపొందించారు. ‘దిల్ రూబా’ సినిమాతో విశ్వ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. “క” వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రంగా ‘దిల్ రూబా’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన ‘దిల్ రూబా’ టీజర్ కు మంచి స్పందన లభించింది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి మార్చి 14న రిలీజ్ కానుంది.
READ MORE: Fish bite: చేప కాటు వల్ల ప్రాణాంతక ఇన్ఫెక్షన్.. చేయిని కోల్పోయిన రైతు..
కాగా.. గురువారం రాత్రి ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. తాజాగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న చిత్ర బృందానికి ఓ జర్నలిస్ట్ ప్రశ్న సంధించాడు. ‘‘మీ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ‘సుస్వాగతం’ గుర్తొచ్చింది. మాజీ లవర్ ప్రస్తావన తీసుకొస్తూ మీరు చేసిన కామెంట్.. ‘జల్సా’ మూవీని గుర్తుచేసింది. పవన్ కళ్యాణ్ చిత్రాలతో ‘దిల్ రూబా’కు ఏమైనా కనెక్షన్ ఉందా?” అని తన సందేహాన్ని అడిగాడు. ఈ ప్రశ్నకు స్పందించిన కిరణ్ అబ్బవరం క్లారిటీ ఇచ్చాడు. ‘దిల్ రూబా’కు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి పోలిక లేదని చెప్పాడు. ఇది కొత్త కథ అని చెప్పుకొచ్చాడు.
READ MORE: Vangalapudi Anitha: మహిళా ఎస్సై పట్ల ఆకతాయిల దాడి.. హోంమంత్రి ఆగ్రహం