రేపు (శుక్రవారం మార్చి14)న ఆమిర్ ఖాన్ పుట్టిన రోజు. అయితే ఒక రోజు ముందుగానే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నటుడు ఆమిర్ ఖాన్ ముంబైలోని న్యూస్ రిపోర్టర్లు, ఫొటో గ్రాఫర్లు, అభిమానులతో కలిసి పుట్టిన రోజు వేడుక జరుపుకున్నారు. అందరి ముందు కేక్ కోసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నెలల తరబడి ఊహాగానాల తర్వాత.. సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఎట్టకేలకు తన ప్రేయసి గౌరీ స్ప్రాట్‌తో తన సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆమెతో ఏడాది కాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఆమె తనకు 25 ఏళ్లుగా తెలుసని ఆమీర్ చెప్పారు. టైమ్స్ నౌ ప్రకారం.. ఆమిర్ తన పుట్టినరోజు వేడుకలో గౌరీ స్ప్రాట్‌ను పరిచయం చేశారు. అయితే, ఆమిర్ తన స్నేహితురాలి ఫోటోలు తీయవద్దని కోరారు. ఈ సంబంధాన్ని గోప్యంగా ఉంచాలని సినీ ఫొటోగ్రాఫర్స్‌ని అభ్యర్థించారు.
READ MORE: Garlic Health Benefits: వెల్లులి నిజంగానే వ్యాధులను నయం చేస్తుందా? నిజమెంత!
అభిమానుల సమక్షంలో తన భాగస్వామి గౌరీ స్ప్రాట్‌ని పరిచయం చేసి అమీర్ ఖాన్ అందరినీ ఆశ్చర్యపరిచారు. గౌరీ స్ప్రాట్ బెంగళూరుకు చెందిన మహిళగా సమాచారం. ఆమె సెలబ్రిటీ కాదు. ఆమెకు ఇప్పటికే 6 సంవత్సరాల బిడ్డ కూడా ఉన్నాడు. ప్రస్తుతం.. ఆమిర్ అభిమానులు గౌరీ చిత్రాల కోసం ఆసక్తిగా వెతుకుతున్నారు. ఆమిర్ ఖాన్ మొదట రీనా దత్తాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమీర్ కు రీనా దంపతులకు ఒక కుమారుడు జునైద్ ఖాన్, కుమార్తె ఐరా ఉన్నారు. రీనా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత.. ఆమిర్ కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. వీరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. ఆమిర్, కిరణ్ కూడా విడాకులు తీసుకున్నారు. తాజాగా మరో కొత్త గర్ల్ ఫ్రెండ్‌ను పరిచయం చేశాడు.
Tags: