రెండేళ్లుగా ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులకు శుభవార్త. ‘ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో ఓ సక్సెస్ ను అందుకున్న హీరో అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల క్రితం తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా ఎట్టకేలకు స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అనుకున్నంత రీతిలో సక్సెస్ సాధించలేక పోయింది. రెండేళ్ల తర్వాత ఓటీటీకి వస్తుంటడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మార్చి 14న సోనీలివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోనీలివ్ స్పష్టం చేసింది. అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ.. గురువారం సాయంత్రం నుంచే సోనీలివ్ దీనిని అందుబాటులోకి తెచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.
READ MORE: CP CV Anand: 35 ఏళ్ల తర్వాత ఒకేరోజు హోలీ, రంజాన్ రెండో శుక్రవారం.. సీవీ కీలక సూచనలు…
ఇంతకూ ‘ఏజెంట్’ కథ ఏమిటంటే –
రిక్కీ (అఖిల్) ఓ ఎథికల్ హ్యాకర్. ఏ రోజుకైనా ‘రా’ ఏజెంట్ గా మారి దేశానికి సేవలు అందించాలన్నది అతని లక్ష్యం! అందుకోసం ఎగ్జామ్స్ రాస్తాడు కానీ మూడు సార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతాడు. బట్… అతనికి ‘రా’ ఛీఫ్ కల్నల్ మహదేవ్ / డెవిల్ (మమ్ముట్టి) అంటే ఎంతో ఇష్టం. రాజకీయ నాయకులను సైతం ప్రభావితం చేస్తూ సమాంతరంగా పాలన చేస్తున్న ఓ కార్పోరేట్ సిండికేట్ అరాచకాలు డెవిల్ దృష్టిలో పడతాయి. దేశంలో పలు దారుణాలకు పాల్పడుతూ ఆ సిండికేట్ అంతర్జాతీయంగా తన ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తుంది. వారి పన్నాగాలను అడ్డుకోవాలని డెవిల్ భావిస్తాడు. అందుకోసం తన శిష్యుడైన ధర్మతేజ / గాడ్ (డెమో మోరియా) కు రంగంలోకి దింపుతాడు. కొన్నేళ్ళ పాటు డెవిల్ కనుసన్నల్లో మెలిసిన గాడ్ కు సెండికేట్ అధినేత కావాలనే కోరిక కలుగుతుంది. అంతేకాదు… చైనాతో చేతులు కలిపి, ఈ దేశాన్నే అతలాకుతలం చేయాలని అనుకుంటాడు. అతని ఆగడాలకు రిక్కీ ద్వారా డెవిల్ ఎలా చెక్ పెట్టాడు? ఈ క్రమంలో అతనికి ఏమైంది? ‘రా’ ఏజెంట్ గా తన ప్రతాపం చూపాలనుకున్న రిక్కీ ఈ ఎసైన్ మెంట్ కోసం ఏం చేశాడు? అనేది మిగతా కథ.
READ MORE: CP CV Anand: 35 ఏళ్ల తర్వాత ఒకేరోజు హోలీ, రంజాన్ రెండో శుక్రవారం.. సీవీ కీలక సూచనలు…