అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి పథకాలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రక్రియ మార్చి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం.. ఈ ప్రక్రియలో ఏ ఒక్కరూ మిగిలిపోరని తెలిపారు. "వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరానికి రైతు భరోసా ఇస్తాం. ఉపాధి హామీలో నమోదై, కనీసం ఇరవై రోజులు పని చేసిన వారికి ఆత్మీయ భరోసా ఇస్తాం. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం నాలుగు పథకాలపై సమీక్ష చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ…
కరీంనగర్ మేయర్ సునీల్ రావుతో సహ పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేయర్ తో పాటు బీజేపీలో చేరిన వారిలో శ్రీదేవి చంద్రమౌళి, లెక్కల స్వప్న వేణు తదితరులు ఉన్నారు.
పోచారంలో హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. కూల్చివేతల అనంతరం ప్రకటన విడుదల చేశారు. “దీప్తి శ్రీనగర్‌లోని 200 ఎకరాల్లో లే అవుట్ ను నల్ల మల్లారెడ్డి డెవలప్ చేశారు. లే అవుట్ లో 2,200 ప్లాట్లను సింగరేణి ఎంప్లాయీస్ తో పాటు ప్రైవేట్ వ్యక్తులు కొన్నారు. లే అవుట్ ఒప్పందం ప్రకారం నల్ల మల్లారెడ్డి రోడ్లు, డ్రైనేజ్ డెవలప్ చేయాలి. కానీ సెక్యూరిటీ పేరుతో 200 ఎకరాల లే అవుట్ చుట్టూ ఎత్తైన […]
కిడ్నీ రాకెట్ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉన్నారు. ఏడుగురు అరెస్ట్ ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు సీపి సుధీర్ బాబు తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. "అరెస్ట్ అయినవారిలో జనరల్ సర్జన్ డాక్టర్ సిద్ధంశెట్టి అవినాష్, అలకనంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి సుమంత్ కర్ణాటకకు చెందిన మధ్యవర్తి ప్రదీప్‌లతో పాటు ఆస్పత్రి సిబ్బంది గోపి, రవి, రవీందర్, హరీష్, సాయిలును అరెస్ట్ చేశాం.
కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. నేడు అన్నారం బ్యారేజి నిర్మాణ సంస్థ అఫ్కాన్స్‌ను సంస్థ విచారించింది. అన్నారం బ్యారేజి నిర్మాణ సంస్థ అఫ్కాన్స్ పై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది..
బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన షార్ట్ ఫిలిం దర్శకుడుగా గుర్తించారు. ప్రమాదం తరువాత.. కారును వదిలిపెట్టి నిందితుడు పారిపోయాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది.. స్నేహితులతో మద్యం సేవించి ఉండటం కారణంగా ఈ ఘటన జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. నవంబర్ 2023 సంవత్సరంలో 15 రోజుల పాటు త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు.. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేన రెడ్డి పీఏను అధికారులు విచారించారు. విచారణ సమయంలో ఫోన్ ట్యాప్ వ్యవహారం బయటపడింది.. ప్రస్తుతం ఇంద్రసేనరెడ్డి త్రిపుర గవర్నర్‌గా ఉన్నారు.
కిషన్ రెడ్డి పదేళ్లు మంత్రిగా ఉండి ఏం చేశారు? తెలంగాణకు కొత్త ప్రాజెక్టు తీసుకువచ్చారా? అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ తో లోపాయికారీ ఒప్పందంతో కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు.
కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం బండి సంజయ్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. "మేయర్ తో కలిసి 20 మంది కార్పొరేటర్లు బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందు మేయర్ సునీల్ రావు ప్రతిపాదన ఉంచారు.
డ్చల్ జిల్లాలోని మునీరాబాద్ ప్రాంతంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల యువతిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ అమానుష ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను పరిశీలించారు.