బడ్జెట్ కు వారం రోజుల ముందు దేశంలోనే అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ నష్టాన్ని చవిచూసింది. స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లు పడిపోయిన కారణంగా.. కంపెనీ మార్కెట్ క్యాప్ నుంచి దాదాపు రూ.75 వేల కోట్ల నష్టం వాటిల్లింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.74,969.35 కోట్లు తగ్గి రూ.16,85,998.34 కోట్లకు చేరుకుంది. 5 రోజుల్లో రూ.75 వేల కోట్ల నష్టం రావడంతో కంపెనీ తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. మరోవైపు, ఎల్ఐసీ, ఎస్బీఐ మార్కెట్ క్యాప్‌లో కూడా భారీ క్షీణత కనిపించింది.
ప్రేమ, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు... కారణమేదైనా కొందరు ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తున్నారు. దేశంలో రోజు రోజుకూ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. బలవన్మరణాలకు ఎక్కువగా ఆర్థిక సమస్యలు, ఒత్తిడి భరించలేకపోవడం కారణంగా ఉన్నాయి. తాజాగా నోయిడాలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. నోయిడాలో ఒక మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం శనివారం ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డును మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అలాగే పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మశ్రీకి 30 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
సంక్రాంతికి వస్తున్నాం యూనిట్ రాజమండ్రిలో సందడి చేసింది. సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా హీరో వెంకటేష్ రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి. శ్యామల థియేటర్ వద్ద బాణాసంచా కాల్చి... హీరో వెంకటేష్ , దర్శకుడు అనిల్ రావిపూడి యూనిట్ సభ్యులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రేక్షకులతో హీరో వెంకటేష్ కొద్దిసేపు సందడి చేశారు. హీరో వెంకటేష్ తో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత శిరీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నా గుండెలపై కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తుపట్టా అని డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు అన్నారు. గతంలో తనకు న్యాయం జరగదు అనే భావం ఉండేదని.. కానీ ఇప్పుడు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ.. "పీవీ సునీల్ కుమార్ వెనుక ఉన్న ఆర్మీని చూసి భయపడుతున్నారా? వాళ్ల దగ్గర ఏమైనా తుపాకులు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతూ ఉంది..
ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటైంది. వ్యవస్థాపక ఛైర్మన్‌గా టీజీ వెంకటేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను కర్నూలులో ఏర్పాటు చేశాం. సినీ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం.తమిళనాడు సినిమాలకు పుట్టినిల్లుగా ఉండేది.మద్రాస్ లో రాయలసీమ వాళ్లు పెద్ద,పెద్ద స్టూడియోలు నిర్మించి సినిమాలకు ప్రాణం పోశారు
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.. తాజాగా గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఆదివారం (26 జనవరి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 75,550, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 82,420 గా ఉంది. వెండి కిలో ధర రూ. 97,500 లుగా ఉంది.
కేంద్ర ప్రకటించిన పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల పంపిణీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అస్తిత్వానికి, ఆత్మగౌరానికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో ప్రతిష్టాత్మక నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 98 మందికి 5 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "రాష్ట్రంలో ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఏ పాలకులు ఇవ్వలేదు. గత ప్రభుత్వం కంటే మేము 20% పెంచి రైతు భరోసా ఇస్తున్నాం.
హైడ్రా చర్యలకు దివ్యానగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. కూల్చివేతలుపై హైడ్రాను స్వాగతించారు. సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీతో హైడ్రా కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. "20 ఏళ్లుగా నల్ల మల్లారెడ్డి అరాచకాలు ఎదురుకుంటున్నాం.. దివ్యా నగర్ లే ఔట్ చుట్టూ గోడను నిర్మించి చుట్టుపక్కల కాలనీ వాసులకు ఇబ్బంది పెట్టాడు..