త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 మధ్య ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిసింది. 2023 అక్టోబర్ 26 న గవర్నర్‌గా నియామకమయిన ఇంద్రసేనారెడ్డి. నిన్న ఇంద్రసేనా రెడ్డి వ్యక్తి గత సహాయకుడు విచారణకు హాజరయ్యారు. READ MORE: Rajya Sabha Members: రాజ్యసభ రాజకీయం.. విజయసాయిరెడ్డి రాజీనామాతో కొత్త చర్చ..! గత ఏడాది డిసెంబర్ లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన సమయంలో ఎస్ఐబీ కార్యాలయంలోని […]
హైడ్రా కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ఘట్కేసర్లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్‌ను కూల్చివేతకు హైడ్రా రెడీ అయ్యింది. నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు అనేకమైన ఫిర్యాదులు అందాయి. సర్వే చేసి హైడ్రా.. అది ప్రభుత్వ స్థలం అని నిర్ధారించి, కూల్చివేతలకు సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.
ప్రైవేట్ జూనియర్ కాలేజీలకి కోర్టులో ఊరట దక్కలేదు. అటు ఇంటర్ బోర్డు కూడా వెనక్కి తగ్గడం లేదు. మిక్స్డ్ అక్యుపెన్సీ భవనాల్లో నడుస్తున్న కళాశాలలకు అనుబంధ గుర్తింపు కోసం బోర్డు లక్ష రూపాయలు ఫైన్ వేసింది. దీంతో కొన్ని కాలేజి యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. రేపే ఇంటర్ ఫీజ్ కట్టేందుకు చివరి తేదీ కావడంతో ఈ లక్ష రూపాయలు కట్టేందుకు కళాశాలలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రతి విద్యార్థి వద్ద లేట్ ఫీ రూపంలో 2 వేల 500 రూపాయల ఎగ్జామ్ ఫీ చెల్లించేందుకు సిద్ధమవుతున్నాయి.
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లింది. ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నిందితులు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి అనారోగ్యంతో మృతి చెందారు. కేసీఆర్ ఐదవ సోదరి, కేటీఆర్ మేనత్త, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు తల్లి చీటీ సకలమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. తన సోదరి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు మేడ్చల్ దగ్గరలోని ఆమె నివాసానికి కేసీఆర్ వెళ్లనున్నారు.
2027లో జరిగే పుష్కరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం 271 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఏడాదికి ఈ స్టేషన్ నుంచి గంటకు 9,533 మంది రాకపోకలు సాగిస్తారన్న అంచనాలతో స్టేషన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి కింద రూ.250 కోట్ల పనులు చేపట్టేలా టెండర్లు పిలిచింది.
టయోటా ఫార్చ్యూనర్ ఇండియన్ మార్కెట్లో శక్తివంతమైన ఎస్యూవీ సెగ్మెంట్. మరే ఇతర కంపెనీ ముందు దాని ముందు నిలవలేదు. అటువంటి పరిస్థితిలో ఫార్చ్యూనర్ ను సవాలు చేసేందుకు.. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవలే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన మొదటి డీ ప్లస్ సెగ్మెంట్‌ను ఎస్యూవీ ఎంజీ మెజిస్టర్ను ఆవిష్కరించింది. మెజిస్టర్ పరిమాణంలో చాలా పెద్దగా ఉంది. పొడవు, ఎత్తు కూడా బాగానే ఉంది. దీని డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది.
భారతీయ కస్టమర్లలో స్కూటర్ల డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. గత నెల అంటే డిసెంబర్ 2024 అమ్మకాల డేటాను పరిశీలిస్తే.. మరోసారి హోండా యాక్టివా అగ్రస్థానాన్ని సాధించింది. గత నెలలో 1,20,981 యూనిట్ల హోండా యాక్టివా స్కూటర్లు విక్రయించారు. కానీ.. గతేడాదితో పోలిస్తే.. యాక్టివా విక్రయాలు 16.18 శాతం క్షీణించాయి. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 స్కూటర్లను చూద్దాం..
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజీకయ జీవితం ఆధారంగా తెరక్కెక్కిన ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్ర పోషించారు. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా.. పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 17న థియేటర్లలో విడుదలైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఖలిస్థాన్ ఉగ్రవాది పన్ను హాజరుకావడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కనిపించడంపై విదేశాంగ శాఖ స్పందించింది. ఈ విషయాన్ని అమెరికాతో భారత్ లేవనెత్తుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. దేశ జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను అమెరికాతో భారత్ లేవనెత్తుతూనే ఉంటుందని ఆయన శుక్రవారం తెలిపారు.