యూపీలోని గంగా పరీవాహక ప్రాంతంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలను కనుగొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) డ్రిల్లింగ్ ప్రారంభించింది. శాటిలైట్, జియోలాజికల్ సర్వే తర్వాత జియాలజిస్టులు డ్రిల్లింగ్ పనిని ప్రారంభించారు. సుమారు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. బల్లియాలోని సాగర్‌పాలి గ్రామ సమీపంలోని గ్రామసభ వైన (రట్టుచక్)లో హైవే వైపున డ్రిల్లింగ్‌ను బృందం ప్రారంభించింది. అస్సాం నుంచి క్రేన్లు, పరికరాలు కొనుగోలు చేశారు.
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భారత్ ప్రతిపాదన కారణంగానే సుబియాంటో పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. తొలిసారిగా ఇండోనేషియా ఆర్మీకి చెందిన బృందం కూడా ఈ వేడుకలో కవాతు చేయనుంది. గణతంత్ర దినోత్సవానికి ఇప్పటి వరకు ముగ్గురు రాష్ట్రపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంధన భద్రత, ఆరోగ్య భద్రత, రక్షణ రంగంతో సహా పలు అంశాలపై ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నందున ఆయన భారత పర్యటన…
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఐఐటీ బాబా అభయ్ సింగ్ గురించి చర్చ జరుగుతోంది. మొదట ఐఐటీలో చదివి ఉద్యోగం చేసిన అభయ్ సింగ్ ఇప్పుడు బాబాగా అవతారమెత్తాడు. ఇప్పుడు అభయ్ సింగ్ ఐఐటీ బాబాగా ఇంటర్నెట్లో ఫేమస్ అయ్యాడు. ఆయన జీవితంతో పాటు ఆయన పలు వాదనలు కూడా చాలా చర్చనీయాంశమయ్యాయి.
షాహునగరి కొల్లాపూర్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కొల్హాపూర్ కుస్తీ, బెల్లం, ఆహార సంస్కృతి, కొల్హాపురి చెప్పులు కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. రాజకీయ నాయకుల నుంచి బాలీవుడ్ తారల వరకు అందరూ కొల్హాపురి చెప్పులు వేసుకోవడానికి తహతహలాడుతున్నారు. ఇప్పుడు ఈ కొల్హాపురి చప్పల్ పాకిస్థాన్‌లోనూ క్రేజ్‌గా మారింది. ఆన్లైన్ మాధ్యమాల ద్వారా పాకిస్థాన్ నుంచి డిమాండ్ భారీగా పెరిగింది. ఇక్కడి వ్యాపారులు పెద్ద మొత్తంలో చెప్పులను పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్నారు.
హెచ్-1బీ వీసాదారులైన భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఉపశమనం ప్రకటించారు. NYT ప్రకారం.. ఈ వీసాలు నిలిపివేయబడవని ట్రంప్ అన్నారు. అమెరికాకు ప్రతిభ కావాలని.. తమకు ఇంజనీర్లు మాత్రమే అవసరమని ట్రంప్ పేర్కొన్నట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. H-1బీపై జరుగుతున్న చర్చ గురించి ట్రంప్‌ను ప్రశ్నించగా.. "నేను అనుకూల, ప్రతికూల వాదనలతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుతం అమెరికాకు అవసరమైన ప్రతిభను ఈ వీసా ప్రోగ్రామ్ ద్వారా మాత్రమే కనుగొనవచ్చు. ఈ వీసాలు నిలిపి వేయం." అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా.. అమెరికాలో…
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వారంలోనే ఆయన చేసిన ప్రకటనతో అమెరికాలో నివసిస్తున్న వలసదారులలో భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికాలోని చాలా మంది భారతీయ విద్యార్థులు కళాశాల సమయం ముగిసిన తర్వాత పార్ట్ టైమ్ పని చేస్తూ డబ్బు సంపాదించేవారు. ఇప్పుడు వారు తమ పనిని వదిలివేశారు. ఓ జాతీయ మీడియాతో అక్కడున్న కొందరు విద్యార్థులు మాట్లాడారు. ఈ విద్యార్థులలో కొందరు, యూఎస్‌లో మనుగడ సాగించడానికి పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చాలా ముఖ్యమన్నారు. కానీ..…
డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన 72 గంటల్లోనే అక్రమ వలసదారులపై ప్రభుత్వం భారీ చర్యలు ప్రారంభించింది. దీంతో డ్రీమ్‌ను వెతుక్కుంటూ అమెరికాకు వచ్చిన లక్షల మంది వలసదారులపై అధికారులు అతి పెద్ద ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. 12 నుంచి 15 గంటల్లోనే ట్రంప్ ప్రభుత్వం వేలాది మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకుంది. ఇప్పటివరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశామని, 373 మందిని అదుపులోకి తీసుకుని శిబిరాలకు పంపామని వైట్‌హౌస్ ట్వీట్ చేసింది.
వక్ఫ్ సవరణ బిల్లుపై శుక్రవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో దుమారం రేగింది. ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన మార్పులను అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వడం లేదని విపక్ష సభ్యులు ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లుపై... జాయింట్ కమిటీ కాశ్మీర్ మత గురువు మిర్వాయిజ్ ఒమర్ ఫరూక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అభిప్రాయాలను వినేందుకు సిద్ధమైంది. మిర్వాయిజ్‌ను పిలవడానికి ముందు.. కమిటీ సభ్యులు తమలో తాము చర్చించుకున్నారు. అనంతరం ప్రతిపక్ష నాయకులు సమావేశంలో గందరగోళం సృష్టించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా వక్ఫ్ సవరణ…
తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్‌పై ఈడీ కీలక చర్యలు తీసుకుంది. మనీలాండరింగ్ కేసులో అనితా రాధాకృష్ణన్‌కు చెందిన రూ.1.26 కోట్ల విలువైన ఆస్తులను దర్యాప్తు సంస్థ జప్తు చేసింది. తూత్తుకుడి, మదురై, చెన్నైలలో అనితా రాధాకృష్ణన్‌కు చెందిన స్థిరాస్తులను అటాచ్ చేయాలని పీఎంఎల్ఏ కింద ఆదేశాలు జారీ చేసినట్లు ఈడీ తన ప్రకటనలో తెలిపింది.
చలనచిత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుకు ఈ ఏడాది నామినేషన్లను ప్రకటించారు. గురువారం లాస్ ఏంజిల్స్‌లో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్ 2025కి నామినేట్ చేయబడిన పేర్లను వెల్లడించారు.