మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ ప్రాంతంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల యువతిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ అమానుష ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను పరిశీలించారు. యువతి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆమె ఎవరూ? ఇక్కడకు ఎలా వచ్చింది? ఎవరితో వచ్చింది? అని తెలుసుకునేందుకు పోలీసులు పరిశోధన ముమ్మరం చేశారు.
తాజాగా పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు. ఒంటి పైన ఉన్న ఆభరణాలను సేకరించారు. మహిళ వంటి పైన ఎనిమిది రకాల ఆభరణాలు గుర్తించారు. నాలుగు చేతి ఉంగరాలు గొలుసు చేతి గాజులు కాళ్ల పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. మహిళ మృతదేహంపైన మూడు చోట్ల టాటూలు వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎడమచేతి పైన నరేంద్ర అనే టాటూ ఉన్నట్లు తెలిపారు. కుడి చేతి పైన తెలుగులో శ్రీకాంత్ ఇంగ్లీషులో రోహిత్ పేర్లతో టాటూలు ఉన్నాయని పోలీసుల తెలిపారు.
READ MORE: Phone Tapping Case: త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్..