గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. 1.34 వేల మంది సచివాలయాల్లో పని చేస్తున్నారన్నారు. ఏక పక్ష ధోరణితో ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో సేవలు చెయ్యడానికి సచివాలయ వ్యవస్థ ఏర్పడిందని చెప్పారు.
భూ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుందని మంత్రి అనగానే సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం విశాఖపట్నం ముఖ్యనేతలతో రెవెన్యూ.. ఎండోమెంట్ సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "గత ప్రభుత్వంలో భూములను కొట్టేశారా అనే ఆలోచనలు ఉండేవి.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నాం. సింహాచలం భూములపై గతంలో అనేక మంది హామీలు ఇచ్చారు. కానీ పూర్తి చేయలేకపోయారు.. ప్రస్తుతం పంచ గ్రామాల భూముల అంశంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
కేరళలో కాంగ్రెస్ మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకుడు వివాదాస్పద ప్రకటన చేశారు. మహిళలు, పురుషులు సమానం కాదని ముస్లిం లీగ్ కేరళ విభాగం ప్రధాన కార్యదర్శి పీఎంఏ సలాం అన్నారు. స్త్రీలను, పురుషులను సమానంగా పిలవడం వాస్తవికతకు వ్యతిరేకమన్నారు. అంటే ప్రస్తుత సమాజంలో ఆడ-మగ సమానత్వం లేదని ఆయన అభిప్రాయం.
గత ఆరేళ్లలో ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు దాఖలు చేసిన కేసుల వివరాలను సుప్రీంకోర్టు బుధవారం (జనవరి 29) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 2019లో ఆమోదించిన ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టాన్ని ఉల్లంఘించి, ట్రిపుల్ తలాక్ చెప్పి ఎంత మంది ముస్లిం పురుషులు తమ భార్యలకు విడాకులు ఇచ్చారో స్పష్టత ఇవ్వాలని కోరింది.
ఆవాల నూనెలో బ్యూటీ నుంచి హెల్త్ వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దానిని మీ దినచర్యలో భాగం చేసుకుంటే.. మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ నూనెను వంటకు ఎంచుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. ఆవనూనెలో అవసరమైన విటమిన్లు, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల వంటగదిలో ఇది చాలా అవసరం. అదనంగా ఇది తక్కువ సంతృప్త కొవ్వును కలిగి ఉంటుంది. ఇది అతి ముఖ్యంగా కీళ్ల నొప్పులకు బాగా పనిచేస్తుంది.
క్యాన్సర్ అనే పదం వింటే చాలు ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుంది. ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చాలా మంది భావిస్తుంటారు. వాస్తవంగా చాలా రకాల క్యాన్సర్లు తీవ్రంగా ముదరకముందే గుర్తించి చికిత్సను తీసుకోవడం ద్వారా రోగులు ప్రాణాలతో బయటపడుతున్నారు. సమస్యేంటంటే ఈ వ్యాధి సోకిన చాలా మంది డాక్టర్లు చెప్పే మాటలు సరిగా వినిపించుకోవడం లేదు. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించగలిగే కొన్ని రకాల లక్షణాలను కూడా రోగులు పట్టించుకోవడం లేదు.
టాటా మోటార్స్ నెక్సాన్ సీఎన్జీ (Nexon CNG) రెడ్ డార్క్‌ను విడుదల చేసింది. కంపెనీ ఎక్స్-షోరూమ్ ధరలను రూ.12.70 లక్షల నుంచి రూ.13.69 లక్షల వరకు ఉంచింది. ఫియర్లెస్ + PS, క్రియేటివ్ + PS, క్రియేటివ్ + S వంటి మూడు వేరియంట్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ దీనిని భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ప్రవేశపెట్టింది. రెడ్ డార్క్ ఎడిషన్ ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. రెడ్ కలర్ యాక్సెంట్లతో ఎక్స్టీరియర్లో కార్బన్ బ్లాక్ పెయింట్ స్కీమ్‌ను పొందుతుంది.
భారతదేశంలోని మార్కెట్లో ఎస్‌యూవీల సెగ్మెంట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆకర్షణీయమైన లుక్, తక్కువ ధర కారణంగా భారతీయ వినియోగదారులను ఆకర్షిస్తుంది. మీరు అద్భుతమైన మైలేజీతో కూడిన శక్తివంతమైన ఎస్‌యూవీలు కొనాలని చూస్తున్నట్లయితే.. ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అత్యధిక మైలేజ్ ఇచ్చే 5 ఎస్‌యూవీలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 1. గ్రాండ్ విటారా సీఎన్జీ- మైలేజీ కేజీకి 26.6 కి.మీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) తమ మిడ్-సైజ్ ఎస్యూవీ గ్రాండ్ విటారా (Grand […]
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై గతేడాది అత్యాచారం కేసు నమోదయింది. మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు అందడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అత్యాచార ఆరోపణల కేసులో జానీ మాస్టర్ 36 రోజులుగా జైల్లో ఉన్నారు. గతేడాది అక్టోబర్…
సత్యసాయి జిల్లా సీకే పల్లి బీసీ హాస్టల్ లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందని ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి ఆదేశాలతో బీసీ సంక్షేమశాఖాధికారులు భోజనం సదుపాయం కల్పించారు. హెచ్ డబ్ల్యూవోపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.