ఏపీ డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా నియామకమయ్యారు. హరీష్‌కుమార్ గుప్తాను డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్నారు. ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన అధికారి. గత ఎన్నికల ముందు హరీష్‌కుమార్‌ను ఈసీ డీజీగా నియమించింది. ఈ నెల 31తో డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ముగియనుంది.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై సీపీఐ రామకృష్ణ ఫైర్ అయ్యారు.. గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రజా తంత్ర వాదులు తీవ్రంగా ఖండించాలన్నారు.. బుధవారం ఆయన మాట్లాడుతూ.. "గద్దర్ ఏనాడూ అవార్డుల కోసం, పదవుల కోసం ఎదురు చూడలేదు.. ప్రజల పక్షాన పోరాటం చేసిన గొప్ప కళాకారుడు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాదు ఆయన తొండి సంజయ్..
కాకినాడ లో ఏపీ హోటల్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 జిల్లాల నుంచి హోటల్ ప్రతినిధులు పాల్గొన్నారు. వారితో పాటు మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై వీరి మధ్య చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. హోటల్ ఓనర్లకు శుభవార్త చెప్పారు.
నరసరావుపేటలో డీజీపీ ద్వారకా తిరుమలరావు పర్యటించారు. జిల్లా కేంద్రం నరసరావుపేటలో నూతనంగా నిర్మించిన డాగ్ స్వాడ్, జిల్లా పెరేడ్ గ్రౌండ్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో జగన్ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం బయటపడిందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఆయన ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైందని విమర్శించారు. "పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లం అయ్యింది.
పుంగనూరు ఎస్టేట్‌పై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పుంగనూరులో ఎస్టేట్ అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. గతంలో ఇలాంటి తప్పుడు వార్తలపై యాబైకోట్లు పరువు నష్టం దావా వేసినట్లు గుర్తుచేశారు. 2001లో దాదాపు 75 ఎకరాలను స్థానికుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. "సొంత డబ్బులతో కొన్న దానిపై అసత్య ప్రచారం చేశారు. చంద్రబాబు కుట్రలు చేయడంలో దిట్టా. వ్యక్తిత్వహననం చేయాలని రకరకాల కుట్రలు చేస్తున్నారు. 2001లోనే అక్కడ ఇళ్ళు కట్టాం..
వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. ఈ సేవలను ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వస్తుంది.
విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాక తొలి సందర్శనకు వెళ్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. రేపు తొలి సారి ప్లాంట్ సందర్శన కోసం కేంద్రమంత్రి కుమారస్వామితో కలిసి వెళ్తున్నట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం.. కార్మిక సోదర సలహాలు తీసుకునేందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.
వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో నారాయణ దాఖలు చేసిన కేసుకు సంబంధించి వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కౌంటర్ దాఖలు చేసేందుకు మంత్రి నారాయణ తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూద్రా సమయం కోరారు.
గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి కుటుంబం రూ.8 లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. జగన్ దుబారా, జల్సాలకు ప్రభుత్వ ధనం రూ.19,871 కోట్లు వృథా చేశారని మండిపడ్డారు.