హైడ్రా చర్యలకు దివ్యానగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. కూల్చివేతలుపై హైడ్రాను స్వాగతించారు. సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీతో హైడ్రా కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. “20 ఏళ్లుగా నల్ల మల్లారెడ్డి అరాచకాలు ఎదురుకుంటున్నాం.. దివ్యా నగర్ లే ఔట్ చుట్టూ గోడను నిర్మించి చుట్టుపక్కల కాలనీ వాసులకు ఇబ్బంది పెట్టాడు.. మా ప్లాట్లు అమ్ముకోవాలన్నా నల్ల మల్లా రెడ్డి చెప్పిన ధరకే అమ్మాలి.. దివ్యా నగర్ లో కేవలం నల్ల మల్లారెడ్డి ఐడి కార్డు ఉన్న రియల్టర్లు మాత్రమే ఎంట్రీ ఉంటుంది.. మిగతా ఏ రియల్టర్ల కు అనుమతి ఉండదు.. డెవలప్మెంట్ లో కొందరి ప్లాట్లు కనిపించకుండా పోయాయి.. వాటి గురించి అడిగితే గుర్తించడానికి గజానికి 2 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు.. ఇప్పుడు చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చడం తో కొంత సమస్య తీరింది.. ఇంకా ప్రభుత్వ భూమి కూడా కబ్జా చేశాడు.. వాటి పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం..” అని తెలిపారు.
READ MORE: Ravi Teja : రవితేజ ‘మాస్ జాతర’ గ్లింప్స్ కి టైం ఫిక్స్..
కాగా.. పోచారంలో హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. కూల్చివేతల అనంతరం ప్రకటన విడుదల చేశారు. “దీప్తి శ్రీనగర్‌లోని 200 ఎకరాల్లో లే అవుట్ ను నల్ల మల్లారెడ్డి డెవలప్ చేశారు. లే అవుట్ లో 2,200 ప్లాట్లను సింగరేణి ఎంప్లాయీస్ తో పాటు ప్రైవేట్ వ్యక్తులు కొన్నారు. లే అవుట్ ఒప్పందం ప్రకారం నల్ల మల్లారెడ్డి రోడ్లు, డ్రైనేజ్ డెవలప్ చేయాలి. కానీ సెక్యూరిటీ పేరుతో 200 ఎకరాల లే అవుట్ చుట్టూ ఎత్తైన కాంపౌండ్ వాల్‌ను నిర్మించారు.
రోడ్లు, డ్రైనేజీల కోసం డెవలప్‌మెంట్ ఫండ్ పేరుతో వేలాది ప్లాట్ల యజమానుల నుంచి రూ.10 కోట్లు వసూలు చేశారు. కేవలం రెండు ఎంట్రీ, ఎగ్జిట్‌లను మాత్రమే ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని మాఫియా డాన్ లాగా నల్లమల్లారెడ్డి నియంత్రిస్తున్నారని హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. లే అవుట్‌లలో తమ ఓపెన్ ప్లాట్‌లను ఎవరైనా అమ్మలన్నా నల్ల మల్లా రెడ్డి నియంత్రిస్తారు. ప్లాట్లను విక్రయించే ఎవరైనా ముందుగా NMRని మాత్రమే సంప్రదించాలి.” అని ప్రకటనలో రంగనాథ్ పేర్కొన్నారు.
READ MORE: Bhatti Vikramarka: రేపు పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తాం..
మార్కెట్ రేటు చదరపు గజానికి 25, 000 అయితే, ఎన్‌ఎమ్‌ఆర్ చదరపు గజానికు 15000 మాత్రమే అందిస్తుంది. అలాగే ఎన్‌ఎమ్‌ఆర్ విక్రయ లావాదేవీకి ఎన్‌ఓసీ ఇవ్వాలి. అలాంటి ప్రతి లావాదేవీకి అతనికి 50,000 ఇవ్వాలి. లే అవుట్ లలోని 25% ప్లాట్లు ఇప్పుడు ఎన్‌ఎమ్‌ఆర్, అతని బినామీల యాజమాన్యం చేతిలో ఉన్నాయి. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నల్ల మల్లారెడ్డి కబ్జాలు చేసినట్లు ధృవీకరించారు. కాంపౌండ్ హాల్ నిర్మాణానికి సంబంధిత అధికారి నుంచి అనుమతి తీసుకోలేదు. గేటెడ్ కమ్యూనిటీకి మాత్రమే కాంపౌండ్ వాల్ ఉండేందుకు అనుమతి ఉంది. ఈ 4 కి.మీ కాంపౌండ్ వాల్ కారణంగా పొరుగు కాలనీలు, గ్రామాలు రోడ్లకు వెళ్లే మార్గం తెగిపోయింది. ప్రభుత్వ భూమిని ఎన్‌ఎమ్‌ఆర్ కబ్జా చేసిందనే ఫిర్యాదుపై విచారణ కొనసాగుతుంది. హైడ్రా విచారణ పూర్తయిన తర్వాత సంబంధిత అందరిపై కఠినమైన చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది. హైడ్రా అన్ని చట్టపరమైన నిబంధనలను అనుసరించింది?” అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.