హైదరాబాద్లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతి చెందటం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసి ప్రెస్ నోట్‌లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నదని మాజీ మంత్రి పేర్కొన్నారు.
READ MORE: Subham: సమంతకు ఓటీటీ షాక్?
వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు వ్యూహం అనుసరించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ అలసత్వానికి ఏ పాపం ఎరుగని సామాన్యులు సమిధలవుతున్నారని.. ఎంతో మంది క్షతగాత్రులు అవుతున్నారన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే అగ్నిమాపక శాఖ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
READ MORE: Bigg Boss 9: అంతా ఒట్టిదే.. అసలు కథ ఇదే