Supreme Court: శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ ధర్మ సత్రం కాదు..
- శ్రీలంక పౌరుడి ఆశ్రయం పిటిషన్‌ను విచారించిన కోర్టు
- ఈ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం
- ఇక్కడ సెటిల్ అయ్యేందుకు ఏం హక్కు ఉందని ప్రశ్న
- ఇప్పటికే దేశంలో 140 కోట్ల మంది ఉన్నారని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీయులకు వసతి కల్పించడానికి ధర్మ సత్రం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక పౌరుడి ఆశ్రయం పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు దేశంలో ఆశ్రయం కల్పించవచ్చా అని కోర్టు ప్రశ్నించింది. ఇక్కడ సెటిల్ అయ్యేందుకు మీకేం హక్కు ఉందని ధర్మాసనం అడిగింది. శ్రీలంకలో ఒకప్పుడు చురుకుగా ఉన్న ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE)తో సంబంధాలున్నాయనే అనుమానంతో 2015లో శ్రీలంక జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీపాంకర్ దత్తా, కె వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. గతంలో ఈ కేసుపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు ఆ వ్యక్తిని దోషిగా తేల్చింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2018లో 10 ఏళ్ల శిక్ష వేసింది. అనంతరం అతడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. ఆ కోర్టు మూడేళ్ల శిక్ష తగ్గించింది. ఏడేళ్లు జైలు శిక్ష ఖరారు చేసింది. దీంతో ఆ శ్రీలంక పౌరుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
READ MORE: Hyderabad: సూది గుచ్చకుండానే రక్త పరీక్ష రిపోర్టు.. నిలోఫర్‌లో ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్
Also Read
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
చట్టబద్ధమైన వీసాపైనే భారత్‌కు వచ్చానని, స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశాడు. తన భార్యాపిల్లలు ఈ దేశంలోనే సెటిల్ అయ్యారని చెప్పాడు. తనకూ ఇక్కడే ఆశ్రయం కల్పించాలని కోరాడు. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు భారత్ ఆశ్రయం కల్పించాలా? ఇప్పటికే మా దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అన్ని దేశాల నుంచి వచ్చే వారిని ఆదరించేందుకు భారత్ ధర్మశాల కాదు’’ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఒక వేళ తన ప్రాణాలకు ముప్పు ఉంటే మరేదైనా దేశానికి వెళ్లాలని.. ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సిందే అంటూ తేల్చి చెప్పారు.
READ MORE: Weather Forecast: భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
తాజావార్తలు
-
West Indies Players-ICC: వెస్టిండీస్కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!