HYDRA: హైడ్రా డ్రైవర్ ఉద్యోగాలకు పోటెత్తిన యువత..
- హైడ్రా పార్కింగ్ కార్యాలయం వద్ద పెద్డ సంఖ్యలో బారులు తీరిన యువత
- హైడ్రాలో ఔట్స్ సోర్సింగ్ పద్దతిలో డైవర్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరణ
- నేటి నుంచి రెండు రోజులపాటు దరఖాస్తులు స్వీకరించనున్న హైడ్రా
- కానిస్టేబుల్ పరీక్షలో స్వల్ప మార్కులతో తేడాతో దూరమైన వారికి ప్రాధాన్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల తెలంగాణలోని హైడ్రా సంస్థ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ).. ఔట్ సోర్సింగ్ పద్దతిలో 200 డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి బుధవారం ( మే 19, 21 ) వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రాసి.. స్వల్ప మార్కుల తేడాతో దూరమైన వారికీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు ఒక్కసారిగా పోటెత్తారు. హైడ్రా పార్కింగ్ కార్యాలయం వద్ద పెద్డ సంఖ్యలో బారులు తీరారు.
READ MORE: CM Chandrababu: జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అన్ని జిల్లాల నుంచి భారీగా యువత తరలి వచ్చారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి క్యూ లైన్లో నిలబడి దరఖాస్తు చేసుకున్నారు. హైడ్రా గతంలో కూడా ఔట్ సోర్సింగ్ పద్దతిలో పలు నియామకాలు చేపట్టింది. 2025 ఫిబ్రవరి నెలలో డీఆర్ఎఫ్ లోకి 357 కొత్త ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించింది. ఈ ఉద్యోగులు అంబర్ పేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో వారం రోజుల శిక్షణ అనంతరం ఫీల్డ్ లోకి పంపారు.
READ MORE: Lets Live This Moment: దేవిశ్రీ మార్క్ తో ‘జూనియర్’ ఫస్ట్ సింగిల్ ‘లెట్స్ లివ్ దిస్ మోమెంట్’
పోస్టుల వివరాలు ఎలా ఉన్నాయి:
మొత్తం పోస్టుల సంఖ్య : 200
అర్హతలు: తెలంగాణలో గతంలో విడుదలైన పోలీస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని ఫైనల్ రాత పరీక్ష రాసి, ఎంపిక కాని అభ్యర్థులకు ప్రాధాన్యత.
ఉద్యోగం పేరు: డ్రైవర్ పోస్టులు
టెంపరరీ: ఔట్సోర్సింగ్ విధానంలో ఈ 200 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత జీతం : విడుదలైన ప్రకటనలో జీతం వివరాలు తెలుపలేదు.
సెలక్షన్ ప్రాసెస్: ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతలు కలిగిన అభ్యర్థులకు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ : 19th మే, 2025.
దరఖాస్తులు ఆఖరి తేదీ : 21st మే, 2025
దరఖాస్తు ఫీజు: ఎటువంటి ఫీజు లేదు
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..