Nellore Chepala Pulusu: ఇంట్లోనే అదిరిపోయే నెల్లూరు చేపల పులుసు చేసుకుందాం రండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, వీటిని శరీరం స్వతహాగా తయారు చేసుకోలేదు కాబట్టి చేపలు తినడం ఆరోగ్యానికి చాలా రకారకాల పోషకాలు అందుతాయి. చేపలు మంచి ప్రొటీన్ ఆహారం. అయితే చేపల పులుసులో నెల్లూరి చేపల పులుసుకు ఓ ప్రత్యేకత ఉంది. నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఈ నెల్లూరి చేపల పులుసుని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, పదార్థాలు, కుకింగ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
READ MORE: Pawan Kalyan: రోహింగ్యాలు, స్లీపర్ సెల్స్‌పై దృష్టి పెట్టండి!
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
తయారీకి కావాల్సినవి..
చేపలు- 1 కేజీ,
చింతపండు – 50 గ్రాములు
ఉల్లిపాయలు- 2 (సన్నగా కట్ చేసి పెట్టుకోండి)
పచ్చిమిర్చి- 4
పుల్లమామిడికాయ- 1
ధనియాలు- 2 టీస్పూన్లు
ఆవాలు- అర టీస్పూన్
నూనె- 4 టేబుల్ స్పూన్లు
కొద్దిగా కరివేపాకు
కొద్దిగా కొత్తిమీర
అల్లం వెల్లుల్లి పేస్టు- 1 టీస్పూన్
పసుపు- అర టీస్పూన్
కారం- 4 టీస్పూన్లు
ఉప్పు- సరిపడా
నిమ్మకాయ- 1
టమాట- 1
మెంతులు- అర టీస్పూన్
జీలకర్ర- 1 టీస్పూన్
READ MORE: Manoj: ఇలాంటి పాత్ర ఇప్పటివరకు చేయలేదు.. సమయం దొరికితే వంట!
నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం:
ఫస్ట్ చేపల్ని బాగా కడిగి శుభ్రం చేసుకోండి. కావాల్సిన సైజ్‌లో కట్ చేసుకోండి. కొంచెం పెద్దగా కట్ చేసుకోవడం మంచిది. ముక్కలను మరోసారి ఉప్పు, నిమ్మకాయతో బాగా కడగాలి. చేప ముక్కలపై 2 టీస్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, చిటికెడు పసుపు వేసి.. బాగా కలుపుకోవాలి. చేప ముక్కలకు బాగా పట్టుకునేలా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకొన్న ముక్కలను ఓ 30 నిమిషాలు పక్కన పెట్టండి. 50 గ్రాముల చింతపండు తీసుకొని.. శుభ్రంగా కడిగి.. కొద్దిసేపు నానబెట్టాలి. గుజ్జు పక్కకు తీసి ఆ వాటర్‌ని వేరు చేయాలి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. ఓ పుల్ల మామిడి కాయ తొక్కు తీసి.. చిన్న ముక్కలుగా కోయాలి. అలాగే టమాటాను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ లేకపోతే.. దాని బదులు మరో టమాటను కట్ చేసుకోండి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి.. చిన్న కడాయి పెట్టి.. మెంతులు పావు టీస్పూన్, జీలకర్ర అర టీస్పూన్, ధనియాలు 2 టీస్పూన్లు, ఆవాలు పావు టీస్పూన్ వేసి చిన్న మంటపై దోరగా వేయించి.. అనంతరం ఓ చిన్న గిన్నెలోకి తీసుకోవాలి.
READ MORE: Manoj: ఇలాంటి పాత్ర ఇప్పటివరకు చేయలేదు.. సమయం దొరికితే వంట!
అవి కొద్దిగా చల్లారాక… రోలు లేదా మిక్సీలో వేసి పొడిలా చేసుకోండి. తర్వాత కొంచెం పెద్ద గిన్నె లేదా కడాయి స్టవ్ మీద పెట్టి.. అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వెయ్యండి. నూనె వేడెక్కాక… మెంతులు పావు టీస్పూన్, ఆవాలు పావు టీస్పూన్, జీలకర్ర అర టీస్పూన్, కరివేపాకు కొద్దిగా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు కాస్తా వేగాక.. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీస్పూన్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు దోరగా వేయించాలి. అనంతరం మామిడి ముక్కలు, టమాటా ముక్కలు వేసి.. ఫ్రై చేయాలి. అవి కాస్త మెత్తగా అయ్యాక… పసుపు పావు టీస్పూన్, కారం 2 టీస్పూన్లు, ఉప్పు సరిపడా వెయ్యాలి. ఆల్రెడీ మొదట్లో ముక్కలకు ఉప్పు వేశాం. కాబట్టి… దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పడు సరిపడా వేసుకోవాలి. తర్వాత ముందుగానే సిద్ధం చేసిన మసాల పొడిని ఇప్పుడు వేసి.. నిమిషం పాటూ ఫ్రై చెయ్యాలి. ఆ తర్వాత… చింతపుండు గుజ్జును వేసుకుని కావాల్సినంత నీరు పోసుకోవాలి. 3 నిమిషాలు ఉడకనివ్వాలి. పులుసు నురగ వచ్చిన తర్వాత.. చేప ముక్కల్ని వన్ బై వన్ నిదానంగా వేయాలి. 10 నిమిషాలు ఉడికించాలి. చేప ముక్కల రంగు మారుతూ ఉంటే… ఉడికినట్లే అని అర్థం. సరిగ్గా అప్పుడే కొత్తిమీర వేసి… స్టప్ ఆపేయండి. నోరూరించే గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయినట్టే..
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!