భారతదేశంలో మొట్టమొదటి సరిగా సూది అవసరం లేకుండానే రక్త పరీక్ష చేసి ఒక్క నిమిషంలోనే రిపోర్ట్ ఇచ్చే ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్‌ను నిలోఫర్ లో అందుబాటులోకి తెచ్చారు.. నిలోఫర్ హాస్పిటల్, సుశేనా హెల్త్ ఫౌండేషన్‌తో కలిసి క్విక్ వైటల్స్ దిన్ని అందుబాటులోకి తెచ్చింది.. ఫోటోప్లెథిస్మోగ్రఫీ ద్వారా మొబైల్ లో ఫేస్ స్కానింగ్ ద్వారా 20 నుంచి 30 సెకన్లలోనే టెస్టులు పూర్తవుతాయి. ఈ పరీక్ష విధానాన్ని మొదట నిలోఫర్ లోకి అందుబాటులోకి తెచ్చి తరువాత మహారాష్ట్రలో ప్రవేశపెట్టనున్నారు.. నిలోఫర్ లో పిల్లలకు, గర్భిణులకు ఇలాంటి టెస్టులు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.
READ MORE: Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు బయటపెట్టిన తండ్రి..