పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను ఇటీవల హర్యానా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న ఆమె నుంచి వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలోని కొన్ని పేజీలు పాకిస్థాన్ పట్ల ఆమెకున్న అభిమానాన్ని, అక్కడి పర్యటన అనుభవాలను వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా విచారిస్తున్నారు. కాగా.. నేటితో జ్యోతి మల్హోత్రా పోలీస్ కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. తాను పాకిస్థాన్ గూఢచారిని అని ఆమె అంగీకరించింది. విచారణ అధికారులు ఎదుట నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం.
READ MORE: Kothalavadi: యష్ తల్లి నిర్మాతగా ‘కొత్తలవాడి’ .. టీజర్ భలే ఉందే!
తాజాగా పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా జ్యోతి పాక్‌కు సమాచారం చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో పాక్ సరిహద్దు రాష్ట్రాలను వైమానిక, క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం బ్లాకౌట్లు నిర్వహించింది. ఈ సమాచారం కూడా ఆమె డానిష్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందం ఆమె నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌ట్యాప్ స్వాధీనం చేసుకొన్నాయి. దీంతోపాటు.. ఆమెకున్న రెండు బ్యాంకు ఖాతాలను కూడా విశ్లేషిస్తున్నాయి.
READ MORE: Kothalavadi: యష్ తల్లి నిర్మాతగా ‘కొత్తలవాడి’ .. టీజర్ భలే ఉందే!