ఇంత భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా తరలి వచ్చారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్ర కార్యక్రమం జరిగింది. వర్షం కుస్తున్నప్పటికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగించారు. కరీంనగర్ లో ఏక్తా యాత్ర ప్రారంభిస్తే నన్ను హిందూ పిచ్చోడని హేళన చేశారన్నారు. ఏక్తా యాత్ర రోజే పోటీ యాత్రలు పెట్టి విచ్చిన్నం చేయాలని చూశారన్నారు. తరలివచ్చిన ఈ జనాన్ని చూస్తుంటే ఎందాకైనా పోరాడాలన్పిస్తోందన్నారు. గతంలో ఇదే హిందూ ఏక్తా యాత్ర చేస్తుంటే నాకు గుండెపోటు వచ్చిందని గుర్తు చేశారు. అమ్మవారు కరుణించి మళ్లీ తనకు పునర్జన్మనిచ్చిందని చెప్పారు. అందుకే నా బోనస్ జీవితమంతా కాషాయ జెండా, సనాతన ధర్మం కోసమే అని తెలిపారు. అందుకే పాతబస్తీ వెళ్లి సభ పెట్టి కాషాయ జెండా సత్తా చూపినట్లు వివరించారు. పహల్గాం ఘటన తరువాత హిందువుల్లో ఐక్యతగా ఉండాలనే ఆలోచన వచ్చిందని.. మతం పేరు అడిగి బట్టలిప్పి హిందువని తెలిశాకే చంపేశారన్నారు. అప్పుడు మోడీ ఏం చేశారో చూశారో తెలుసు కదా? పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి ఆ ఉగ్రవాదులకు నా అన్న వాళ్లు లేకుండా చేసిన సైన్యం మనదని కొనియాడారు.
READ MORE: Suhasini: నాయకన్ సినిమా చూసి మణిరత్నం గొంతు కోశా : సుహాసిని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశామని బండి సంజయ్ అన్నారు. “అమెరికా ట్విన్ టవర్స్ పై అల్ ఖైదా దాడి చేసి 6 వేల మందిని చంపితే… 10 ఏళ్ల దాకా ఏమీ చేయలేదు. 10 ఏళ్ల తరువాతే ఒసామా బిన్ లాడెన్ ను పట్టుకుని చంపింది. కానీ పహల్గాం ఘటన జరిగిన 15 రోజుల్లోనే ఉగ్రవాదుల అంతు చూసిన సైన్యం నా భారత సైన్యానిదే. పాకిస్థాన్ పై యుద్దం చిన్నదని తక్కువ చేసిన మల్లికార్జున్ ఖర్గేను సవాల్ చేస్తున్నా. పాకిస్థాన్ లోపలకు వెళ్లి 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా?..
పాక్ ఆర్మీకి చెందిన 11 మిలటరీ బేస్‌లను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా? 20 శాతం మేరకు పాకిస్తాన్ మిలటరీ మౌలికవసతులను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా? మన సైన్యం దెబ్బకు భయపడి యుద్దం ఆపాలంటూ కాళ్లబేరానికి రావడం చిన్న యుద్ధమా?.. ఏది చిన్న యుద్దమో ఖర్గే సమాధానం చెప్పాలి. యుద్దంలో ఎన్ని మన రాఫెల్ విమానాలు ఎన్ని ధ్వంసమయ్యాయో లెక్క చెప్పాలని రాహుల్ గాంధీ మాట్లాడటం సిగ్గుచేటు. మన సైన్య శౌర్య పరాక్రమాలను పొగడాల్సింది పోయి తక్కువ చేసి చూపుతారా? రాహుల్ గాంధీకి భారత దేశంలో కంటే పాకిస్థాన్ లోనే ఎక్కువ మంది అభిమానులున్నారట. పాకిస్థాన్ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ట్రెండింగ్ లో ఉండటమే నిదర్శనం. ట్రంప్ కు భయపడి మోదీ యుద్దం ఆపేసిండని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటు.” అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేసు.. ఆమెకు స్పాన్సర్ చేసిన సంస్థతో అజర్ బైజాన్ ఒప్పందం..
కాంగ్రెస్ హయాంలో 1971 యుద్దం జరిగితే పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేసినప్పుడు పీవోకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదో సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. “మన దేశంలో అక్రమంగా నివాసముంటున్న విదేశీయుల్ని దేశమంతటా ఏరివేస్తుంటే మీరెందుకు సైలెంట్ గా ఉన్నరు? వాళ్లకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అందించి సబ్సిడీలు ఇచ్చింది నిజం కాదా? మీకు నిజంగా దేశభక్తి ఉంటే అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను, విదేశీయుల్ని బయటకు పంపే దమ్ముందా? లేనిపక్షంలో వాళ్లను పంపివ్వబోం, రేషన్ కార్డులిస్తాం అని కేంద్రానికి లేఖ రాస్తారా? వాళ్లను ఎట్లా పంపించాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో కేంద్రం చూసుకుంటుంది. ఎన్నాళ్లు బతికామన్నది కాదు…. బతికినన్నాళ్లు ఏం చేశామన్నదే ముఖ్యం. భారత్ ఉఫ్ మని ఊదితే పాకిస్థాన్ ఖతమైపోతది. యుద్దం ఆగిపోలేదు… పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషించినన్నాళ్లు యుద్దం చేస్తూనే ఉంటాం. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. నరేంద్రమోడీ లాంటి మహానుభావుడికి సంఘీభావం తెలపండి. భారత సైన్యానికి బాసటగా నిలవండి. సరిహద్దుల్లో మంచు, వాన, ఎండ, చలికి వెరవకుండా పోరాడుతున్న సైనికులకు శిరసు వంచి నమస్కరిస్తున్న. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కుహానా లౌకిక వాదులకు వార్నింగ్ ఇవ్వడానికే హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నాం. భారీ వర్షాన్ని లెక్క చేయకుండా తరలివచ్చిన ప్రజలందరికీ హ్యాట్సాఫ్.. ఆపరేషన్ సింధూర్ లో మహిళా సైనికుల చూపిన వీరోచిత పోరాటాలు భేష్ ఝాన్సీ లక్ష్మీ బాయి రాణి రుద్రమలకు వారిద్దరూ ప్రతీకగా నిలిచారు. భార్య ముందు భర్తను, పిల్లల ముందు తండ్రిని, తల్లి ముందు కొడుకును పహల్గాంలో ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపారు. అందుకే పాకిస్థాన్ పై దాడి చేసి నరేంద్ర మోడీ భారత్ సైన్యం సత్తాను చాటి చెప్పారు.” అని బండి సంజయ్ ప్రసంగించారు.