మియాపూర్ బెట్టింగ్ యాప్స్ కేసుల వివరాలు సేకరిస్తున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ముందుగా యాప్స్ నిర్వహకులకు నోటీసులు పంపి వారి వివరణ తీసుకున్నాక దర్యాప్తు ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో పాన్ ఇండియా స్టార్స్ ఉన్న నేపథ్యంలో లీగల్ పరిణామాలను కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. మోరల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా సినీ సెలబ్రిటీలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని మియాపూర్ పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తామన్నారు.
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై స్పందించారు. తన పేరు ప్రస్తుతం చర్చకు వస్తుండటంపై ఆయన వివరణ ఇచ్చారు. ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా వీడియోను విడుదల చేసిన ఆయన, గతంలో తాను ఓ గేమింగ్ యాప్ యాడ్ చేసిన విషయాన్ని అంగీకరించారు. అయితే, ఆ ప్రకటనను చేయడం తప్పుడు నిర్ణయమని తెలుసుకుని, తానే స్వయంగా ఒప్పందాన్ని పొడిగించకుండా నిష్క్రమించానని స్పష్టం చేశారు.
టీటీడీ వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. రవీంద్ర భారతిలో బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి టీటీడీని ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి సారి వాళ్ళని మా ఎమ్మె్ల్యే లెటర్ తో దర్శనం అడుక్కోవడం ఎందుకు? అని ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మాకు వైటీడీ ఉందన్నారు. భద్రాచలంలో రాముడు లేడా? అని ప్రశ్నించారు. మనకు శివుడి ఆలయాలు తక్కువా? అన్నారు. కేటీఆర్.. మిస్ ఇండియా పోటీలు ఇక్కడ ఎందుకు అంటున్నారని.. ఆయన బాధ ఏంటన్నారు. హైదరాబాద్ కి పర్యాటక సందడి వద్దా..? అని…
మోడీ అంటే నాకు గొప్ప గౌరవమని సీంఎ రేవంత్ రెడ్డి అన్నారు. కానీ అభివృద్ధి అంత హైదరాబాద్.. చెన్నె.. బెంగుళూరు చెందిందన్నారు. గుజరాత్, యూపీ నుంచి మన దగ్గరకు ఉద్యోగాల కోసం వస్తున్నారని సీఎం తెలిపారు. వేరే ప్రాంతాల వాళ్లు మీ దగ్గరకు ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. మేము అభివృద్ధి మేము సాధించినట్టా? లేక మీరు చేసినట్టా? అని మోడీని అడిగారు. రవీంద్ర భారతిలో బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగాల్లో వివిధ పోస్టులకు ఎంపికైన 922 మందికి అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అభ్యర్థులు నియామక పత్రాలు గురించి దశాబ్దకాలం ఎదురుచూశారన్నారు. ఉద్యోగ బాధ్యత అనిర్వచనీయ ఆనందాయకమని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో మరోసారి హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. నార్సింగిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో యువ ఇంజనీర్ నవీన్ చారీ ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో ఆసక్తితో, ఆశలతో తన మొదటి ఉద్యోగం ప్రారంభించిన నవీన్ చారీ ఆ రోజు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. కోకాపేట్ టీ-గ్రీల్ వద్ద నవీన్ చారీ తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం అతడిని వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు నవీన్ చారీ తీవ్ర…
నక్సలైట్లకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే మార్చి 31 వరకు నక్సలిజం లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మన సైనికులు 'నక్సల్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్' దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని కొనియాడారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్‌లలో మన భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు చనిపోయారని తెలిపారు.
బెట్టింగ్ యాప్స్ వివాదంపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న హీరోలు, హీరోయిన్ల మీద కేసులు పెట్టడం మంచి పరిణామం అన్నారు. కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ఏంటి? అని ప్రశ్నించారు.. వీళ్ళ ప్రమోషన్ కారణంగా అమాయకులు బలవుతున్నారని మండిపడ్డారు.. మీరు వందల కోట్లు సంపాదించుకుంటున్నారని.. మీరు సంపాదించుకున్న సంపాదనను కనీసం చారిటీల ద్వారా ఖర్చు చేయాల్సిందన్నారు. మీకు ఎందుకు ఇంత కక్కుర్తి అని మండిపడ్డారు. ఇలాంటి పనులు…
నలభై ఏళ్ల ప్రజా జీవితంలో ప్రగతిశీల బడ్జెట్ నిన్న చూశానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శంగా ఉందని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి బడ్జెట్ రూపొందించారని..ఎన్నికల వాగ్దానాలను కాకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఉందన్నారు. బీఆర్ఎస్ నుంచి రూ.7 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందని.. గత ప్రభుత్వం అమలు చేసిన ఏ ఒక్క కార్యకరమైనా తమ ప్రభుత్వం నిలిపివేసిందా? అని ప్రశ్నించారు.
ఇంటి ముందు నిద్రిస్తున్న కొడుకును ఇనుప రాడ్డుతో కొట్టి హత్యకు ఒడిగట్టింది తల్లి హత్యకు భార్య కూడా సహకరించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. మొదట అనుమానాస్పద మృతిగా వందతులు వచ్చినా.. దారుణ హత్య చేశారని పుకార్లు వినిపించాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బక్కని వెంకటేష్ వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. తల్లి భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేవాడు. మంగళవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రించాడు. బుధవారం తెల్లవారు జామున…