ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండు జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. 18వ సీజన్లో భాగంగా నేడు రెండు టీంలు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు తలపడినప్పుడల్లా.. అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ రోజు కూడా అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే.. గత 12 సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ జట్టు తొలి మ్యాచ్‌లో గెలవకపోవడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా లేకుండా ముంబై ఇండియన్స్ ముందుకెళ్తోంది. ఇది టీంకి కలిసి రాకపోవచ్చని క్రికెట్…
ఐపీఎల్ 2025 మూడవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ముంబై ఇండియన్స్ జట్టు సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉంటుంది. గత ఐపీఎల్ సీజన్లో మూడోసారి స్లో ఓవర్ రేట్‌ను ఉల్లంఘించినందుకు ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. ఈ నిషేధం కారణంగా, హార్దిక్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మొదటి మ్యాచ్ ఆడలేడు. మరోవైపు.. రుతురాజ్ గైక్వాడ్…
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్ గురించి మరోసారి ఓపెన్ అయ్యాడు. 43 ఏళ్ల ఎంఎస్ ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. అప్పటి నుంచి కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. గత సీజన్ తనకు చివరి సీజన్ అవుతుందని క్రికెట్ అభిమానులు భావించినప్పటికీ.. రిటైర్మెంట్ను ప్రకటించలేదు. 2025 సీజన్ కూడా ఆడనున్నాడు. ఈ ఎడిషన్ ముగిసిన తర్వాత ఆటకు గుడ్‌బై చెబుతాడని మళ్లీ గుసగుసలు మొదలయిన నేపథ్యంలో మారోసారి క్లారిటీ ఇచ్చాడు.
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది కోల్‌కతా నైట్ రైడర్స్. అజింక్య రహానె (56), సునీల్ నరైన్ (44), రఘువంశీ (30) పరుగులు చేశారు. కాగా.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రహానేపైనే అందరి దృష్టి మళ్లింది. అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన రహానే.. అన్ని ఫార్మాట్లలో ఆడాడు. కానీ క్రమంగా టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం అయ్యాడు. టెస్ట్ క్రికెట్లో ప్రధానంగా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే రహానే - తన రాక్-స్టోలిడ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభమైంది. 18వ సీజన్లో మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ -రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. బారిలోకి దిగిన కోల్‌కతా (174) పరుగులు చేసింది. బెంగళూరు విజయం సాధించాలంటే (174) పరుగులు సాధించాల్సి ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ప్రారంభమైంది. 2008లో ప్రారంభమైన ఈ మెగా లీగ్.. ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకుంది. 8 జట్లతో మొదలైన ఈ లీగ్ లో ప్రస్తుతం పది టీమ్స్ ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడతున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి మరో రికార్టు సృష్టించాడు. టీ20 క్రికెట్లో విరాట్ 400వ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇప్పటికే ఈ రికార్డులో రోహిత్ శర్మ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడతున్నాయి. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రజత్ పాటిదార్ ఆర్సిబి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, అజింక్య రహానే కెకెఆర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా సగటు స్కోరు - 191గా నమోదైంది.
ఐపీఎల్ 2025 లో భాగంగా 18వ సీజన్ ప్రారంభ వేడుక జరుగుతోంది. 18వ సీజన్‌కి ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ వేదికపైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రారంభోత్సవంలో ఎవరెవరు ప్రదర్శన ఇస్తారో ఆయన వివరించారు. నటి దిశా పటానీ వేదికపైకి అడుగుపెట్టగానే అందరినీ ఆకట్టుకుంది. తన నృత్య ప్రదర్శనతో వేదికను వెలిగించింది.
మరి కొన్ని నిమిషాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఘనంగా ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభ మ్యాచ్ జరగడం ఇది రెండోసారి. టోర్నమెంట్ మొదటి సీజన్ 2008లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అప్పుడు కేకేఆర్ భారీ తేడాతో గెలిచింది. 2008 ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో బ్రెండన్ మెకల్లమ్ కేకేఆర్ తరఫున 158 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.
ఐపీఎల్ 2025 లో భాగంగా 18వ సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 18వ సీజన్‌కి ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అలాగే రెండో మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉప్పల్ స్టేడియంలో తలపడనున్నాయి.