పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ భార్య చేసిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు లండన్ నుంచి తిరిగి వచ్చిన భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. హత్య తర్వాత.. ఆ భార్య ప్రియుడితో కలిసి తన భర్త మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికింది. ఇద్దరూ కలిసి ఆ ముక్కలను డ్రమ్ములో వేసి సిమెంట్‌లో ప్యాక్ చేశారు. ఆ డ్రమ్మును ఇంట్లోనే ఉంచారు. ఈ ఘటన తర్వాత హృదయం లేని భార్య…
స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లతోపాటు, నాసా వ్యోమగామి, మిషన్ కమాండర్ నిక్ హేగ్, రోస్కాస్మస్ వ్యోమగామి అలెగ్జాండర్ గుర్బునోవ్‌లు భూమి మీదకు సురక్షితంగా వచ్చారు. దీంతో, ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన మిషన్ విజయవంతంగా పూర్తయింది. వీరి రాకపై స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ఈసందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు.
మన జీవితంలో దాదాపు సగం కాలాన్ని నిద్రలోనే గడుపుతాం. ఆరోగ్యానికిది ఎంతో అవసరం. సరిగా నిద్ర పట్టకపోతే చిరాకు, అలసట, విచారం కలుగుతాయి. శారీరక స్పందనల వేగమూ తగ్గుతుంది. తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలెన్నో చుట్టుముడతాయి. దీర్ఘకాలంగా తగినంత నిద్ర పట్టకపోతే నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి.
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేష్ యాదవ్ మంగళవారం సంభాల్, ఔరంగజేబు సమస్యలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అధికార బీజేపీ పార్టీ మతపరమైన ప్రదేశాలను ప్రమాదంలో పడేస్తోందని, మతపరమైన ఉద్రిక్తతను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సంభాల్, ఔరంగజేబు వంటి అంశాలను లేవనెత్తుతుందని అఖిలేష్ యాదవ్ అన్నారు.
మిస్ యూనివర్స్ విక్టోరియా క్జేర్ థీల్విగ్ తెలంగాణ పర్యటనలో ఉంది. మిస్ వరల్డ్ 2025 ప్రీ-ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు చేరుకుంది. ఆమె ఈ రోజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంది. క్జేర్ థీల్విగ్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం కల్పించారు. హిందు సాంప్రదాయ దుస్తులు ధరించిన క్జేర్ థీల్విగ్ స్వామికి ప్రత్యేక పూజలు, అఖండ దీపారాధన చేసింది. అనంతరం పూజారుల ఆశీర్వచనం తీసుకుంది. ఆలయ విశిష్టతను అధికారులు వివరించారు. ఆలయ అధికారులు విక్టోరియా క్జేర్ థీల్విగ్‌కు స్వామి…
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా 2025 తర్వాత.. ఇప్పుడు అందరి కళ్ళు మరో కుంభమేళాపై ఉన్నాయి. ఈ కుంభమేళా దక్షిణ భారతదేశంలో జరుగుతుంది. తమిళనాడులోని కుంభకోణం పట్టణంలో 'మహామహం' (కుంభమేళా) నిర్వహిస్తారు. ఈ 'మహామహం'లో కూడా దేశం నలుమూలల నుంచి దాదాపు కోటి మంది భక్తులు పవిత్రమైన అమృత స్నానానికి వస్తారు. ఈ కుంభమేళా కూడా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 'మహామహం' సందర్భంగా.. "అఖిల భారత సన్యాసి సంఘం" నిర్వహించిన 'మాసి మహాపెరువిల- 2025' కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ (VHP) అఖిల…
ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అనుసంధానానికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈపీఐసీ (EPIC)ని ఆధార్‌తో లింక్ చేయడం కోసం ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఆధార్ కార్డు ఓటర్ కార్డు అనుసంధానానికి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. త్వరలో యుఐడీఏఐ(UIDAI), కేంద్ర ఎన్నికల సంఘం నిపుణుల మధ్య సాంకేతిక సంప్రదింపులు ప్రారంభం కానున్నాయి.
అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్ మద్దతు ఉన్న ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ (OSF) సంస్థతో పాటు బెంగళూరులోని కొన్ని అనుబంధ సంస్థలలో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనలపై దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సోదాలు విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కింద జరుగుతున్నాయని, ఓఎస్ఎఫ్ తో పాటు కొన్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా ఇందులో పాల్గొన్నాయని అధికారులు తెలిపారు. ఓఎస్ఎఫ్ ద్వారా విదేశీ ప్రత్యక్ష…
బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ స్పష్టం చేశారు. సినీ నటులు, టీవీ యాంకర్లు ఇలాంటి యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించిన వెంటనే వారిపై విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే 11 మంది బెట్టింగ్ యాప్స్‌ను ప్రోత్సహించిన వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు డీసీపీ వెల్లడించారు.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలోని తమ ప్రభుత్వ అధిపతి ఇస్సామ్ అల్-దాలిస్ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారని హమాస్ ధృవీకరించింది . ఈ దాడుల్లో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధిపతి మహమూద్ అబు వాట్ఫా, అంతర్గత భద్రతా సేవ డైరెక్టర్ జనరల్ బహ్జత్ అబు సుల్తాన్ కూడా తుది శ్వాస విడిచారు. కీలక నాయకులు, వారి కుటుంబాలతో పాటు జియోనిస్ట్ ఆక్రమణ దళాల విమానాల ప్రత్యక్ష దాడిలో అమరులయ్యారని హమాస్ ప్రకటనలో పేర్కొంది. తాజా ఉద్రిక్తత రెండు నెలల కాల్పుల విరమణను దెబ్బతీసిన…