MLA Raja Singh: సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ..
- అగ్ని ప్రమాద బాధితుల పట్ల అధికారి అమానవీయ ప్రవర్తన
- అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని అభ్యర్థిస్తూ లేఖ
- చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన ఎమ్మె్ల్యే రాజాసింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద బాధితుల పట్ల విద్యుత్ శాఖ అధికారి అమానవీయ ప్రవర్తనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని అభ్యర్థిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. లేఖలో ఇలా రాసుకొచ్చారు. చార్మినార్‌లోని గుల్జార్ హౌస్‌లో జరిగిన వినాశకరమైన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మన నగరాన్ని కలచివేసింది. మృతుల కుటుంబానికి ఊహించలేని దుఃఖాన్ని కలిగించింది. బాధితులకు పరిపాలన సాధ్యమైనంత మద్దతు అందించాల్సిన సమయంలో విద్యుత్ శాఖకు చెందిన ఓ అధికారి వారిపట్ల అసభ్యకరంగా, అనైతికంగా వ్యవహరించాడు.
READ MORE: Fish Prasadam: హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?
Also Read
ఆ అధికారి ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబం నుంచి ₹2.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అంతే కాకుండా.. ఇంట్లోని ఓ మహిళా సభ్యురాలి పట్ల అభ్యంతరకరమైన భాషను కూడా ఉపయోగించారు. ఆ అధికారి ఆమె ఫోన్‌ను లాక్కొని బెదిరింపులకు దిగాడు. ఇప్పటికే బాధలో ఉన్న కుటుంబాన్ని మరింత ఇబ్బంది పెట్టడం దారుణం.. ఇటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. ఇది ప్రజా సేవా నైతికతను ఉల్లంఘించడం. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ యంత్రాంగానికి చెడ్డపేరు తెస్తాయి. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఈ నేపథ్యంలో పూర్తి దర్యాప్తు జరిగే వరకు సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేయండి..సంఘటనపై ఉన్నత స్థాయి విచారణను ప్రారంభించండి. అధికారిపై చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలు తీసుకునేలా చూసుకోండి. బాధిత కుటుంబానికి అవసరమైన రక్షణ, మద్దతు అందించాలని రాజాసింగ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!