ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2025 సీజన్‌లోని కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రేక్షకులకు స్టేడియం తరహా అనుభూతిని అందించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. వీకెండ్ మ్యాచ్‌లు, ప్లేఆఫ్‌లను థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ ఈరోజు (మార్చి 22, శనివారం) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగనుంది. 18వ సీజన్.. కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. అయితే.. వర్షం అభిమానుల ఉత్సాహాన్ని క్షీణింపజేస్తోంది. గత రెండు రోజులుగా కోల్‌కతాలో ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన యాంటీ సైక్లోనిక్ ప్రసరణ కారణంగా మార్చి 22 వరకు కోల్‌కతాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
ప్రస్తుత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఎస్ఆర్ఎంబీ స్టీల్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యాడు. ప్రపంచ కప్ విజేత దిగ్గజ కెప్టెన్లు కపిల్ దేవ్, ఎమ్ఎస్ ధోనిలతో ఎలైట్ లీగ్‌లో చేరాడు. ఈ నేపథ్యంలో కొత్త బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ.. కపిల్, ధోనీలతో కలిసి ఓ యాడ్ రూపొందించారు. ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు..
బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ తన కొత్త సూపర్‌కార్ వాన్‌క్విష్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన V12 ఇంజిన్‌తో కూడిన ఈ సూపర్ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 8.85 కోట్లు (ఎక్స్-షోరూమ్). ప్రపంచవ్యాప్తంగా 1,000 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ యూనిట్లలో కొన్ని భారతదేశంలో కూడా అమ్మకానికి ఉంచనుంది. అయితే, భారతదేశంలో ఎన్ని యూనిట్లను అమ్మకానికి ఉంచారనే దానిపై కంపెనీ సమాచారం ఇవ్వలేదు.
మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, జనవరి 2025లో 99.67 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించింది. వీటిలో 13.27 లక్షల ఖాతాలను వినియోగదారు నివేదిక లేకుండానే నిషేధించారు. కంపెనీ ప్రకారం.. ప్లాట్‌ఫారమ్ భద్రతను బలోపేతం చేయడానికి, స్పామ్, స్కామ్‌లను నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం న్యూ గొల్లగూడెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తుకు బానిసై డబ్బులు ఇవ్వమని వేధిస్తున్న కొడుకును, తల్లే హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది. కొడుకు రాజ్ కుమార్ వేధింపులు తట్టుకోలేక తల్లి దూడమ్మ సంచలన నిర్ణయం తీసుకుంది. కొడుకును కాళ్లు కట్టేసి, కొట్టి ఉరివేసి హత్య చేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
హైదరాబాద్ మెట్రో రైళ్లపై బెట్టింగ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు కనిపించడంపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. ఈ విషయంపై తన దృష్టికి వచ్చిన వెంటనే, తక్షణమే ఆ ప్రకటనలను తొలగించాల్సిందిగా ఎల్అండ్టీ, సంబంధిత యాడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. "కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయన్న అంశం నా దృష్టికి వచ్చింది. ఈ ప్రకటనలను వెంటనే తొలగించాలని సంబంధిత సంస్థలను ఆదేశించాను. ఈ రాత్రికే పూర్తిగా అటువంటి యాడ్స్‌ను తీసివేస్తారు" అని ఎన్వీఎస్ రెడ్డి…
సోషల్ మీడియాలో సంచలనంగా మారిన పరేషాన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్ తాజాగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేస్తూ.. తనపై, తన తల్లిపై నడుస్తున్న విమర్శలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నా అన్వేష్ వ్యాఖ్యలపై ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇమ్రాన్ తన వీడియోలో మాట్లాడుతూ.. "నా తల్లిని ఉద్దేశించి అనవసరంగా వ్యాఖ్యలు చేయడం బాధించేస్తోంది. ఇది వ్యక్తిగత విమర్శలకు, కుటుంబ సభ్యులను లాగడానికి చాలా దారుణమైన ఉదాహరణ. నా అన్వేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై వెంటనే చర్యలు…
గ్రేటర్ వాసులకు ఏ సమస్యనైనా అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లే సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ యాప్ పేరే మై జీహెచ్ఎంసీ. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. రహదారులపై గుంతలు, చెత్త, మురుగు నీటి వ్యవస్థ బాగోలేకపోయినా... ఇలా ఏ సమస్య అయినా ఒక ఫోటో తీసి యాప్ లో అప్ లోడ్ చేస్తే చాలు... ఏ ప్రాంతం నుంచి ఫోటో అప్ లోడ్ అయితే ఆ ప్రాంత అధికారులకు సమస్య చేరుతుంది. అలా యాప్ లో…
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ మాయలో పడి వేల సంఖ్యలో యువకులు ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణ పోలీసులు వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం మియాపూర్ పీఎస్ పరిధలో 25మందిపై నమోదు నమోదు చేశారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు.