తన మిస్ వరల్డ్ ప్రయాణం ప్రారంభానికి ఇండియానే వేదిక అని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా పేర్కొంది. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడింది. నమస్తే ఇండియా.. హెల్లో వరల్డ్.. అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించింది. తాను గత మిస్ వరల్డ్ పోటీల్లో ముంబాయిలోనే విజేతగా నిలిచినట్లు తెలిపింది. ఇండియా తనకు ఎప్పుడు స్పెషల్ అని చెప్పింది. ఇక్కడ ప్రజల చాలా మంచి అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుందని స్పష్టం చేసింది.
ఆహారం, నీరు మనిషికి ఎంత ఆవశ్యమో.. నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర ద్వారానే శరీరానికి కొత్త ఉత్సాహం పొందుతుంది. రోజుకు 8 గంటల పాటు నిద్రించకుంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజుకు నాలుగు గంటల పాటు నిద్రపోయేవారు.. లేకుంటే అర్ధరాత్రంతా మేల్కొని ఆరు గంటలు నిద్రతో సరిపెట్టుకునే వారు.. మరుసటి రోజు యాక్టివ్‌గా పనిచేయలేరు. కాగా.. గ్రామాల్లో చాలా త్వరగా నిద్ర పోతుంటారు. మధ్య రాత్రి లేచినప్పుడు గజ్జల సవ్వడి వినపడుతోందని చెబుతుంటారు. లేదా.. గజ్జల శబ్దానికే కొందరు నిద్ర లేచి…
కర్ణాటక అసెంబ్లీలో ఓ సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే వింత ప్రతిపాదన తీసుకొచ్చారు. పురుషులకు వారానికి రెండు బాటిళ్ల ఉచిత మద్యం ఇవ్వాలని జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప అసెంబ్లీలో డిమాండ్ చేశారు. నేడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్సైజ్ ఆదాయ లక్ష్యాన్ని రూ.36,500 కోట్ల నుంచి రూ.40,000 కోట్లకు పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దీనిని వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ దీని కోసం మళ్ళీ పన్నులు పెంచాల్సి ఉంటుంది. నేను మీకు కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను.…
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం మర్రిపాడులో సంచలనం రేపినా కర్ణాటక చెందిన వివాహిత హత్య కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త భార్యను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. మీడియా సమావేశంలో ఈ విషయాన్ని డిఎస్పీ కొండయ్య నాయుడు వెల్లడించారు. డిఎస్పీ కథనం ప్రకారం.. లక్ష్మీ, కుమార్ భార్య, భర్తలు. వీరు రెండేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకుని గుర్రంకొండ నివాసం ఉంటున్నారు.
భారతదేశంలో రైళ్ల మీద దాడులు చెయ్యడం సర్వసాధారణం అయ్యింది. ముఖ్యంగా వందేభారత్ రైళ్లు ప్రారంభం అయిన తరువాత రైళ్ల మీద అల్లరిమూకలు రాళ్లు రువ్వడం చాలా ఎక్కువ అయ్యింది. వందేభారత్ రైళ్లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన తరువాత మామూలు రైళ్ల మీద దాడులు ఎక్కువ అయ్యాయి. రైళ్లపై రాళ్లు రువ్వడం, ట్రాక్‌లను ధ్వంసం చేయడం వంటి కేసులు పెరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి 2023 నుంచి ఫిబ్రవరి 2025 వరకు మొత్తం 7,971 కేసులు నమోదైనట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.…
రాజ్యసభలో చర్చ సందర్భంగా టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే కేంద్ర దర్యాప్తు సంస్థల గురించి ప్రశ్నలు లేవనెత్తారు. హోం మంత్రిత్వ శాఖను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు. దీనిపై హోంమంత్రి అమిత్ షా స్పందించిన సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అమిత్ షా సంచలన విషయాన్ని వెల్లడించారు. సీబీఐ, ఎంపీ సాకేత్ చెబుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి రావని ఆయన అన్నారు. కాబట్టి, ప్రశ్నలు లేవనెత్తే ముందు, వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలని హోంమంత్రి సూచించారు.
కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. కోర్టు ఆయనకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కొనసాగించింది. అనంతరం ఈ కేసు విచారణను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం మార్చి 26కి వాయిదా వేసింది. అంతకుముందు.. శివరాజ్ సింగ్ చౌహాన్‌పై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టివేయడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. దీంతో చౌహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ సహా ముగ్గురు బీజేపీ…
సునీతా విలియమ్స్ భూమిపై అడుగుపెట్టారు. స్పేస్ఎక్స్ క్యాప్సూల్ ఫ్లోరిడా తీరంలో దిగిన విషయం తెలిసిందే. ఆమె దిగిన వెంటనే.. ఆ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ క్యాప్సూల్ చుట్టూ అనేక డాల్ఫిన్లు చుట్టుముట్టాయి. ఈ డాల్ఫిన్లు చాలా సేపు క్యాప్సూల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఏదో చెప్పాలనుకుంటున్నట్లు అనిపించింది. ఈ అందమైన దృశ్యానికి సంబంధించిన వీడియో కూడా బయటపడింది.
తొమ్మిది నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు ఈ రోజు తెరపడింది. దివి నుంచి వ్యోమగాములు దివికి చేరుకున్నారు. దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తోపాటూ.. బుచ్ విల్మోర్ మరో ఇద్దరు వ్యోమగాములు.. విజయవంతంగా భూమిపై అడుగు పెట్టారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగు ప్రయాణమైన వాళ్లు.. భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 3.27 నిమిషాలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు.…
నేడు ఒక కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు పలు ప్రశ్నలు సంధించింది. దేశంలోని పలు రాష్ట్రాలు రేషన్ పంపిణీ వ్యవస్థల ద్వారా నిరుపేదలకు సబ్సిడీతో కూడిన నిత్యావసర సరకులను సరఫరా చేస్తున్నామని చెప్పుకుంటున్నట్లు గుర్తు చేసింది. అయితే ఈ రేషన్ బీపీఎల్(దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు) లబ్ధిదారుల కుటుంబాలకు చేరడం లేదని పేర్కొంది. రాష్ట్రాలు రేషన్ కార్డులను ప్రదర్శన కోసం ఉపయోగిస్తున్నారా?