అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ‘నల్లమల డిక్లరేషన్’ను సైతం ఆవిష్కరించారు. ఈ డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం నల్లమల ప్రాంతం గురించి సీఎం ప్రసంగించారు. ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతం. ఎవరో ఒక నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలని అనేవారని నాటి రోజులను సీఎం గుర్తు చేశారు. సీఎంగా ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే తన గుండె ఉప్పొంగిపోతోందన్నారు.
దేశానికి ఇందిరా గాంధీ లాంటి పౌరుషం ఉన్న ప్రధాని కావాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 50 ఏండ్ల తర్వాత కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఇందిరమ్మ ఉందన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు.
తెలంగాణ గడ్డపై దశాబ్దాలుగా ఉన్న దున్నేవాడిదే భూమి నినాదాన్ని ఇందిరా సౌర గిరి జిల్లా వికాసం వంటి పథకాల ద్వారా చట్టాలుగా అమలు చేస్తున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. తెలంగాణ గడ్డపై ఉన్న నినాదాలు చట్టాలుగా మారాలంటే మరో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నారు.
12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కారాల స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద పుష్కర పండగకు విడుదల చేసిన 35 కోట్ల రూపాయలు ఏర్పాట్లకు సరిపోవన్నారు.
రేపు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, ఉమ్మడి కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది.. ఈదురు గాలులతో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని.. రైతులతో పాటు సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా పిడుగులు సైతం పడే అవకాశం ఉంది. అందుకే వర్షం వచ్చే సమయంలో చెట్ల కింద ఉండకూడదు.
ఆసియాలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు మళ్లీ పెరుగుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్ వంటి జనసాంద్రత కలిగిన ఆర్థిక కేంద్రాలలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం, బూస్టర్ డోస్లు తీసుకునే వృద్ధుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఈ పెరుగుదల సంభవిస్తుందని ఆరోగ్య అధికారులు భావిస్తున్నారు. సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. మే 3 నాటికి COVID-19 కేసుల సంఖ్య 14,200 కు చేరుకుంది. ఇది గత వారం కంటే దాదాపు 28% ఎక్కువ.
గుల్జార్హౌజ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి దారి తీసిన అసలైన కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలను చేపట్టేందుకు, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఫాల్కన్ స్కాం కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో సీఐడీ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. తెలంగాణ సీఐడీ బీహార్ లో ఇద్దరిని అరెస్ట్ చేసింది. పట్టుబడ్డ ఇద్దరు నిందితులు A2 అమర్ దీప్ కుటుంబ సభ్యులు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కాంలో నేరస్థులుగా ఉన్నారని..
రష్యాలో ఓ టీచర్ విద్యార్థితో చేయకూడని పనులు చేసింది. తన వద్ద విద్యాభ్యాసం చేసే విద్యార్థిని లొంగదీసుకుని తన శృంగార కోర్కెలను తీర్చుకుంది. బాలుడి తల్లికి ఈ విషయం తెలిసి.. ఆమె పోలీసులను సంప్రదించింది. దీంతో ఆ ఉపాధ్యాయురాలికి తొమ్మిది ఏళ్ల జైలు శిక్ష పడింది.