దేశంలో మరోసారి కరోనా భయం పుట్టుకొస్తోంది. కేసులు రోజు రోజుకూ స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఎలాంటి పరిస్థితులు అనుభవించాల్సి వస్తోందో అని భయపడుతున్నారు. గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్‌లో కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సమాచారం వెల్లడించింది. దేశంలో కొత్తగా 257 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది. కేసులన్నీ స్వల్ప తీవ్రతతో ఉన్నాయని తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. పరిస్థితి అదుపులోనే…
చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, వీటిని శరీరం స్వతహాగా తయారు చేసుకోలేదు కాబట్టి చేపలు తినడం ఆరోగ్యానికి చాలా రకారకాల పోషకాలు అందుతాయి. చేపలు మంచి ప్రొటీన్ ఆహారం. అయితే చేపల పులుసులో నెల్లూరి చేపల పులుసుకు ఓ ప్రత్యేకత ఉంది. నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఈ నెల్లూరి చేపల పులుసుని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, పదార్థాలు, కుకింగ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
భారతదేశం-పాకిస్థాన్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం పార్లమెంటరీ కమిటీకి చెప్పారని ఇండియాటుడే కథనంలో తెలిపింది. సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక స్థాయిలో తీసుకున్నారని మిస్రీ నొక్కిచెప్పారని పార్లమెంటరీ వర్గాలు తెలిపినట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్-పాక్ వివాదాన్ని ఆపడంలో తన పాత్ర గురించి పదే పదే ప్రస్తావించారు. ట్రంప్ వాదనలపై ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మిస్రీ ఈ వ్యాఖ్యలు చేశారు.
సిద్దిపేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యమయ్యారు. లెటర్ రాసిన ఐదుగురు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. అదృశ్యమైన వారిని భార్యాభర్తలు బాలకిషన్(55), వరలక్ష్మి(50), కుమారుడు శ్రవణ్ కుమార్(30), కుమారైలు కావ్య(23), శిరీష(20) గా గుర్తించారు. వీరు పట్టణంలోని ఖాదర్‌పుర వీధిలో నివసించేవారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో ఇంట్లోనే అందరి ఫోన్లు పెట్టేసి వెళ్లిపోయారు. రెండు రోజులుగా కుటుంబ సభ్యులు ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వచ్చిన బంధువులు తాళం వేసి ఉండటాన్ని గమనించారు. అనుమానం వచ్చి పోలీసులకు…
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం భారీ నష్టా్న్ని మిగిల్చింది. తాజాగా గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద కారణాలను అధికారులు గుర్తించారు. అగ్నిప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని తేల్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలిపోవడంతో ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను నడుపుతుండటంతో ఘటన జరిగింది.
ఇటీవల తెలంగాణలోని హైడ్రా సంస్థ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ).. ఔట్ సోర్సింగ్ పద్దతిలో 200 డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి బుధవారం ( మే 19, 21 ) వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రాసి.. స్వల్ప మార్కుల తేడాతో దూరమైన వారికీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు ఒక్కసారిగా పోటెత్తారు. హైడ్రా పార్కింగ్ కార్యాలయం వద్ద పెద్డ సంఖ్యలో…
భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీయులకు వసతి కల్పించడానికి ధర్మ సత్రం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక పౌరుడి ఆశ్రయం పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు దేశంలో ఆశ్రయం కల్పించవచ్చా అని కోర్టు ప్రశ్నించింది. ఇక్కడ సెటిల్ అయ్యేందుకు మీకేం హక్కు ఉందని ధర్మాసనం అడిగింది. శ్రీలంకలో ఒకప్పుడు చురుకుగా ఉన్న ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE)తో సంబంధాలున్నాయనే అనుమానంతో 2015లో శ్రీలంక జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
భారతదేశంలో మొట్టమొదటి సరిగా సూది అవసరం లేకుండానే రక్త పరీక్ష చేసి ఒక్క నిమిషంలోనే రిపోర్ట్ ఇచ్చే ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్‌ను నిలోఫర్ లో అందుబాటులోకి తెచ్చారు.. నిలోఫర్ హాస్పిటల్, సుశేనా హెల్త్ ఫౌండేషన్‌తో కలిసి క్విక్ వైటల్స్ దిన్ని అందుబాటులోకి తెచ్చింది.. ఫోటోప్లెథిస్మోగ్రఫీ ద్వారా మొబైల్ లో ఫేస్ స్కానింగ్ ద్వారా 20 నుంచి 30 సెకన్లలోనే టెస్టులు పూర్తవుతాయి. ఈ పరీక్ష విధానాన్ని మొదట నిలోఫర్ లోకి అందుబాటులోకి తెచ్చి తరువాత మహారాష్ట్రలో ప్రవేశపెట్టనున్నారు.. నిలోఫర్ లో పిల్లలకు, గర్భిణులకు…
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు అందరినీ ఆశ్చర్య పరిచింది. పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టు అనంతరం అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి పాకిస్థాన్, చైనాతో సహా అనేక దేశాలకు ప్రయాణించిందని చెబుతున్నారు. కేవలం రూ.20,000 ఉద్యోగంతో ప్రారంభించిన జ్యోతి, ఇప్పుడు ప్రసిద్ధ యూట్యూబర్‌గా మారింది.
కాళేశ్వరం కమిషన్‌లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కాళేశ్వరం కమిషన్ గడువు మరో రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 31తో కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం ముగియనుంది. బహిరంగ విచారణను ముగించినట్లు కమిషన్ వర్గాలు ప్రకటించాయి. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాజకీయ నాయకుల విచారణ లేకుండానే నివేదిక ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమైంది. పీసీ ఘోష్ కమిషన్ పదవీ కాలం పెంపుతో మళ్ళీ విచారణ కొనసాగించే అవకాశం ఉంది.…