IRCTC ID Block: రైల్వే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో ప్రతిరోజూ అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. దీన్ని ఆపడానికి.. దీంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేలు IRCTCకి చెందిన 2.5 కోట్లకు పైగా వినియోగదారుల ఐడీలను బ్లాక్ చేసింది. ఈ బ్లాక్ చేసిన ఐడీలపై అనుమానాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఎంపీ ఏడీ సింగ్ పార్లమెంటులో దీని గురించి ఒక ప్రశ్న అడిగారు. కోట్లాది మంది IRCTC వినియోగదారుల ఐడీలు ఎందుకు బ్లాక్ చేశారని ప్రశ్నించారు. బుకింగ్స్ తెరిచిన వెంటనే టిక్కెట్లు ఎలా బుక్ అవుతున్నాయి? దీన్ని ఆపడానికి రైల్వే ఏం చర్యలు తీసుకుంటుంది? అని ప్రశ్నించారు. దీనికి ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాచారం ఇచ్చింది.
READ MORE: Chitrapuri Colony: సినీ డిస్ట్రిబ్యూటర్లు, జర్నలిస్ట్ లకు చిత్రపురి ఫ్లాట్లు?
టికెట్ బుకింగ్‌లో అక్రమాలను ఆపడానికే ఐఆర్‌సీటీసీ 2.5 కోట్లకు పైగా యూజర్ ఐడీలను బ్లాక్ చేసిందని స్పష్టం చేసింది. ఈ యూజర్ ఐడీలతో తప్పుడు బుకింగ్స్ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపింది. బుకింగ్ ప్యాటర్న్, యూజర్ బిహేవియర్ ను అధునాతన డేటా విశ్లేషణ ద్వారా గుర్తించిన ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. “రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో మోసాలను నిరోధించేందుకు డిజిటల్ సంస్కరణలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా, తత్కాల్ టికెట్ బుకింగ్‌కు ఆధార్ ప్రమాణీకరణ తప్పనిసరి చేయడం, ఏజెంట్లు తొలి 30 నిమిషాల్లో తత్కాల్ టికెట్లు బుక్ చేయకుండా నిషేధించడం, డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను మెరుగుపరచడం వంటివి ఉన్నాయి.” అని రైల్వే సమాచారం స్పష్టం చేసింది.
READ MORE: Delhi: ఢిల్లీలో రచ్చకెక్కిన కర్ణాటక పంచాయితీ.. కొట్టుకున్న సిద్ధరామయ్య-శివకుమార్ ఆఫీసర్లు
ఆగస్టు ఒకటి నుంచి తత్కాల్ టికెట్లను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఆధార్ అనుసంధానం చేసిన వినియోగదారులు మాత్రమే బుక్ చేసేలా చర్యలు తీసుకున్నారు. పీఆర్‌ఎస్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపు సౌకర్యం అందుబాటులో ఉంచనున్నారు. అదనపు డిమాండ్‌ను తీర్చేందుకు స్పెషల్ రైళ్లను నడపడం, రైళ్ల సామర్థ్యాన్ని పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. వెయిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకులకు టికెట్లు అందించేందుకు వికల్ప్ (ఆల్టర్నేట్ ట్రైన్ అకామడేషన్ స్కీమ్), అప్‌గ్రేడేషన్ స్కీమ్‌లను ప్రవేశపెట్టారు. ఇలా ఇక నుంచి రైల్వే టికెట్ల బుకింగ్స్ సులభతరంగా మారనున్నాయి.