పాకిస్థాన్‌ను ప్రస్తుతం అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టాయి. ఒక వైపు బలూచిస్థాన్‌లో అస్థిరత నెలకొంది. మరోవైపు సింధ్ ప్రావిన్స్ లో నిరసనలు తారా స్థాయికి చేరుకున్నాయి. పహల్గాం ఘటన తర్వాత సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. నీళ్లు లేకపోవడంతో పాక్ ప్రజలు ఎదురు తిరిగారు. తాజాగా పాక్ హోంమంత్రి జియా ఉల్ హసన్ ఇంటిని తగలబెట్టారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తూర్పు మేదినీపూర్ జిల్లాలోని కాంతి ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న ఒక యువకుడు ఏడేళ్ల మహిళ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. స్థానికులు సమాచారం ప్రకారం.. ఏడు సంవత్సరాల క్రితం కాంతి ప్రాంతంలో ఒక స్థానిక మహిళను ఖననం చేశారు.
భారతదేశంతో ఉద్రిక్తత మధ్య, పాకిస్థాన్ చైనాతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిని పాకిస్థాన్ తన విజయాలలో ఒకటిగా భావిస్తోంది. వాణిజ్యం, వ్యవసాయం, పరిశ్రమలు సహా అనేక కీలక రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి పాకిస్థాన్ అంగీకరించింది. పాకిస్థాన్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. మంగళవారం చైనాలో వాంగ్ యితో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సమావేశం తర్వాత చైనాతో వాణిజ్య ఒప్పందం ప్రకటించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్-బీజాపూర్-దంతేవాడ జిల్లా సరిహద్దు ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ప్రముఖ నక్సల్ నాయకుడు బసవరాజు సహా 27 మంది నక్సలైట్లను భద్రతా దళాలు హతమార్చాయి. నక్సలిజంపై పోరాటంలో ఈ ఆపరేషన్ ఒక పెద్ద విజయంగా హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత కోల్‌కతాలోని ప్రముఖ ప్రదేశాలపై రాత్రిపూట అనేక డ్రోన్ లాంటి వస్తువులు ఎగురుతూ కనిపించాయి. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అప్రమత్త మయ్యాయి. సోమవారం హేస్టింగ్స్ ప్రాంతం, పార్క్ సర్కస్, విద్యాసాగర్ సేతు, మైదాన్ మీదుగా కనీసం 8-10 మానవరహిత డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొట్టినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. డ్రోన్ లాంటి వస్తువులను మొదట హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్ అధికారులు చూశారు.
పాకిస్థాన్ లో సైన్యానికి, ఉగ్రవాద సంస్థలకు మధ్య లోతైన సంబంధం ఉందని మరోసారి స్పష్టమైంది. ఇటీవల, సింధ్ ప్రావిన్స్‌లోని మట్లి ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాది రజౌల్లా నిజామాని అలియాస్ సైఫుల్లా గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. సైఫుల్లా మరణం పట్ల పాకిస్థాన్ మర్కజ్ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) సింధ్ యూనిట్ సంతాప సమావేశం నిర్వహించింది.
‘టీ’ ఈ మాట వింటే కానీ.. చాలా మంది నిద్రలేవరు. పొద్దున్నే టీ సిప్ చేయనిదే కొంతమందికి పొద్దుగడవదు. ప్రపంచవ్యాప్తంగా.. ‘టీ’కి దాసోహమైనవారు చాలా మందే ఉన్నారు. అందులోనూ.. ఈ వింటర్లో వేడి టీ తాగితే ఆ మాజానే వేరుగా ఉంటుంది. ఫలానా సమయానికి టీ తాగనిదే పనులు ముందుకు కూడా సాగవంటే.. అంతలా పవర్, ఫేమస్ ఉంది టీకి. టీలో చాలా రకాలు వచ్చినప్పటికీ.. దానికి ఉన్న ప్రాధాన్యతే వేరు. టీకి లవర్స్ కూడా ఎక్కువేనండి. ఆఫీసుల్లో సైతం ఉద్యోగులు టీకి సపరేట్…
పాకిస్థాన్‌లో ఓ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు విద్యార్థులు మరణించారు. దాదాపు 38 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బలోచిస్థాన్‌లోని కుజ్దార్ ప్రావిన్స్‌లో ఈ దాడి చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై స్థానిక అధికారి యాసిర్ ఇక్బార్ దస్తి సమాచారం అందించారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు పిల్లలను తీసుకొస్తున్న సమయంలో దానిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగిందని ఆయన తెలిపారు. ఆత్మహుతి కోసం ఓ కారును వాడినట్లు చెబుతున్నారు.
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను ఇటీవల హర్యానా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 'ట్రావెల్ విత్ జో' పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న ఆమె నుంచి వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలోని కొన్ని పేజీలు పాకిస్థాన్ పట్ల ఆమెకున్న అభిమానాన్ని, అక్కడి పర్యటన అనుభవాలను వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా విచారిస్తున్నారు. కాగా.. నేటితో జ్యోతి…
పాకిస్థాన్‌కు స్పై ఏజెంట్‌గా పని చేస్తూ దొరికిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా నిజం ఒప్పుకుంది. తాను పాకిస్థాన్ గూఢచారిని అని ఆమె అంగీకరించింది. విచారణ అధికారులు ఎదుట నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం పని చేసినట్లు జ్యోతి తెలిపినట్లు తెలుస్తోంది. ఐఎస్ఐ అధికారులను పలు మార్లు కలవడంతో పాటు వాళ్లు అడిగిన సమాచారన్ని చేరవేసినట్లుగా విచారణ సమయంలో ఆమె అంగీకరించింది. దీని కోసం ఐఎస్ఐ ఏజెంట్లతో రహస్యంగా చాట్ చేసినట్లు జ్యోతి వివరించినట్లు తెలుస్తోంది.