Hyderabad: అసలే మద్యం మత్తు.. ఆ తర్వాత గంజాయి కిక్కు.. ఆ నిషాలో ఏం చేస్తున్నారో తెలియదు. కానీ సామాన్య జనాన్ని మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. ఈ మధ్య హైదరాబాద్ సిటీలో ఇలాంటి పోకిరిల బెడద మరీ ఎక్కువైంది. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు చూసీ చూడనట్లు ఉంటున్నారని సిటీజనం గగ్గోలు పెడుతున్నారు. ఇకనైనా పోకిరీల ఆటకట్టించాలని కోరుతున్నారు. రాత్రి అయ్యిందంటే చాలు.. సామాన్య జనాన్ని రోడ్ల మీద నడవనీయడం లేదంటే ఆశ్చర్యం కాదు. ఇక గంజాయి తీసుకుంటున్న కొంత మంది పోకిరీలు.. రోడ్ల మీద వెళ్లే సామాన్య జనాన్ని చాలా దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వీడి పేరు సింహాచలం నాయుడు. విశాఖ జిల్లా పెద్ద గోగాడ వీడి స్వగ్రామం. వీడు పక్కా పోకిరీ.. మూసాపేట్ నుంచి కూకట్‌పల్లి వైపు కారులో వెళ్తున్న దంపతులను దాదాపు అరగంటపాటు ఇబ్బంది పెట్టాడు. ఐతే మద్యం మత్తులో ఉన్నాడు. కాసేపు అయితే దిగుతాడు అని ఆ దంపతులు భావించారు. కారు బానెట్ నుంచి దిగాలని సూచించారు. కానీ ఎంతకూ వినిపించుకోలేదు. పైగా కారు డోర్ తీయ్ అంటూ దబాయించాడు. ఇలా చాలా సేపటి తర్వాత రోడ్డుపై అటుగా వెళ్తున్న యువకులు గమనించి అతన్ని కారు బానెట్ నుంచి కిందకు దించారు. దీంతో కారులోని దంపతులు సాఫీగా ఇంటికి వెళ్లగలిగారు.
READ MORE: Heavy Rain: హైదరాబాద్ లో భారీ వర్షం.. బయటకు రావొద్దని హెచ్చరిక
మరోవైపు కారులో ఉన్న సమయంలో ఆ దంపతులు ఈ పోకిరీ వీడియోను చిత్రీకరించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆ పోకిరీని పట్టుకునేందుకు ప్రయత్నించారు. జస్ట్ వీడియో పోస్ట్ చేసిన గంటలోపే పోలీసులు స్పందించడం విశేషం. అంతే కాదు.. గొడవ చేయడానికి కంటే ముందు ఒక పాన్ షాప్ దగ్గరికి వెళ్లి అతను సిగరెట్స్ కొనుగోలు చేశాడు. ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించాడు. దాని ఆధారంగా అతన్ని పట్టుకున్నారు పోలీసులు. అంతకు ముందు మూసాపేట వైన్స్‌లో మందు తాగినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే సింహాచలనాయుడుకు గంజాయి తాగే అలవాటు ఉందని గుర్తించారు. మద్యం మత్తులో కారు బానెట్ ఎక్కి గొడవ చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. ఐతే ఇలాంటి పోకిరీగాళ్లు కనిపిస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
READ MORE: Machilipatnam: మైనర్లకు లిక్కర్, గంజాయి అలవాటు చేసి వారితో చోరీలు.. కట్‌చేస్తే..